Dog in School: పెంపుడు కుక్కను కిండర్ గార్డెన్ స్కూల్ చేర్పించిన మహిళ, ఫీజు ఎంతో తెలుసా?

Published : Mar 31, 2026, 04:33 PM IST

Dog in School: ఓ మహిళ తన పెంపుడు కుక్కను తన పిల్లాడిలా పెంచుకుంటోంది. ఉద్యోగం కారణంగా కుక్క ఇంట్లో ఒంటరిగా ఉండకూడదనే ఉద్దేశంతో దాన్ని ఓ కిండర్‌గార్టెన్‌ స్కూల్‌లో చేర్పించింది. ఇందుకోసం ఫీజు కూడా భారీగానే కడుతోంది.

PREV
14
కుక్కల కోసం స్పెషల్ స్కూల్

తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల్లో బిజీగా ఉంటే పిల్లలను కిండర్ గార్డెన్ స్కూల్, డేకేర్ వంటి వాటిల్లో చేరుస్తారు. కానీ  ఓ మహిళ తన పెంపుడు కుక్కను తాను ఆఫీసుకు వెళ్లిన తరువాత ఎవరు చూస్తారనే బెంగతో   కిండర్‌గార్టెన్ స్కూల్‌లో చేర్పించింది. దీని కోసం ఏకంగా 1.6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇది ఒక స్కూల్ పిల్లాడి ఫీజుతో సమానం.

24
ఒంటరితనం వద్దని
దక్షిణ చైనాకు చెందిన ఈ మహిళ తన 6 నెలల కుక్కను కిండర్‌గార్టెన్ స్కూల్‌లో చేర్పించింది. ఉద్యోగానికి వెళ్లడం వల్ల రోజుకు 8 నుంచి 10 గంటల పాటు కుక్క ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఇంటికి దగ్గర్లో ఉన్న ఈ స్కూల్‌ను ఎంచుకుంది.
34
స్కూల్‌లో భలే సౌకర్యాలు
ఈ కిండర్‌గార్టెన్‌లో కుక్కలకు సరైన సమయానికి ఆహారం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. రెండు రోజులకోసారి హెల్త్ చెకప్ కూడా చేస్తారు. స్నానం, ఆటలు, ఇతర కుక్కలతో ఆడుకునేందుకు సమయం కేటాయిస్తారు.
44
మొబైల్‌లో లైవ్ వీడియో

యజమానులు తమ పెంపుడు జంతువులను మొబైల్ ద్వారా రియల్ టైమ్‌లో చూసుకోవచ్చు. కుక్క ఏం చేస్తోంది, ఆహారం తిన్నదా, సిబ్బంది సరిగ్గా చూసుకుంటున్నారా అనే విషయాలన్నీ లైవ్‌లో గమనించవచ్చు. దీంతో తను ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నానని ఆ మహిళ చెప్పింది. ఈ కిండర్‌గార్టెన్‌కు కుక్కలను యజమానులే స్వయంగా తీసుకురావాలి, తిరిగి తీసుకెళ్లాలి. అందుకే ఈ మహిళ ఆఫీసుకు వెళ్లేటప్పుడు కుక్కను స్కూల్‌లో డ్రాప్ చేసి, తిరిగి వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories