'స్ట్రేంజర్ థింగ్స్' నటుడిలా ఛాటింగ్.. అతనికోసం భర్తకు విడాకులు ఇచ్చి, 10వేల డాలర్లు మోసపోయిన మహిళ..

First Published | Aug 17, 2023, 11:31 AM IST

'స్ట్రేంజర్ థింగ్స్' నటుడు డాక్రే మోంట్‌గోమెరీతో ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నానని నమ్మిన ఓ మహిళ తన భర్తకు విడాకులు కూడా ఇచ్చింది. 10,000 డాలర్లు మోసపోయింది. 

సోషల్ మీడియాలో ఎలాంటి మోసాలు జరుగుతాయో చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈ ఘటన. ఓ మహిళ  ‘స్ట్రేంజర్ థింగ్స్’ నటుడు డాక్రే మోంట్‌గోమెరీతో ఏడాది పాటు ప్రేమాయణం సాగించింది. అతనికి ఆ మహిళ 10,000 డాలర్లు (రూ. 8,32,252) కూడా ఇచ్చింది.. అంతేకాదు అతనికోసం తన భర్తకు విడాకులు కూడా ఇచ్చింది. చివరికి తనతో ఆన్ లైన్ లో ప్రేమాయణం నడుపుతుంది డాక్రే మోంట్‌గోమెరీ కాదని స్కామర్ అని తెలిసి పోలీసులను ఆశ్రయించింది. 

ఈ విచిత్ర ఘటన బ్రెజిల్ లో వెలుగు చూసింది. బ్రెజిల్ సీఎస్ఎన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ పేరు మెకేలా. ఆమె ఒక ఔత్సాహిక నటి, చిత్రనిర్మాత. ఆమె 'స్ట్రేంజర్ థింగ్స్' సిరీస్‌లో బిల్లీ హార్‌గ్రోవ్‌గా నటించిన మోంట్‌గోమెరీకి డెడికేట్ అయిన ఓ వెబ్‌సైట్‌లో స్కామర్‌ను కలిసింది. అయితే, ఆమె అతను మోంట్‌గోమెరీనే అనుకుంది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఆ స్కామర్ కూడా తాను మోంట్‌గోమెరీ అనే కలరింగ్ ఇచ్చాడు. 


అప్పటికే అతనికి వివాహం అయ్యింది. మెకేలాకూ వివాహం అయ్యింది. అయినా మెకేలా స్కామర్‌తో ప్రేమలో పడింది. వెబ్ సైట్ లో తాను మాట్లాడేది నిజంగా నటుడితోనే అని నమ్మడం ప్రారంభించింది. ఒక సంవత్సరం ఈ కమ్యూనికేషన్ తర్వాత, ఆ "ప్రముఖుడు" మెకేలాను డేట్ కు వెల్దామని ఆహ్వానించాడు. 

అయితే, దాన్ని రహస్యంగా ఉంచాలని.. ఇప్పటికీ తన నిజ జీవిత భాగస్వామి లివ్ పొల్లాక్‌తోనే ఉంటున్నందున సమస్య అవుతుందని హెచ్చరించాడు. మెకేలా తాను మోసపోయానని తెలిసిన తరువాత ఇప్పుడు తన అనుభవాన్ని పంచుకుంటూ యూట్యూబ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. 

అతనికోసం భర్తకు విడాకులు ఇచ్చానని,  వేలకొద్దీ డాలర్లను గిఫ్ట్ కార్డ్‌లలో ఎలా పంపిందో.. వివరించింది. ఒక సందర్భంలో ఆ స్కామర్  ఆమెను.. ఆమెకు భర్త కావాలో.. తాను కావాలో ఎంచుకోమన్నాడు. వెంటనే మెకేలా ఏ మాత్రం సంకోచించకుండా, తన భర్తను విడిచిపెట్టింది. విడాకులు తీసుకుంది. 

అంతటితో సదరు మోసగాడు ఆగలేదు, డాక్రే మోంట్‌గోమెరీలా నటిస్తూ.. ఆమె దగ్గరినుంచి డబ్బును పెద్దమొత్తంలో గుంజాడు. తన భార్య తన బ్యాంకు అకౌంట్ లను కంట్రోల్ చేస్తుందని, తనకు డబ్బు అవసరమని ఆర్థిక సహాయం కూడా అభ్యర్థించాడు. మెకేలా కరిగిపోయి 10,000 డాలర్లు పంపించింది. 

అయితే, డేట్ కు వెడదామన్న వ్యక్తి.. ఆ ప్రపోజల్ పెట్టి.. నెలలు గడిచిపోతున్నా వ్యక్తిగతంగా కలవకపోవడంతో.. ఆమెను అతనిమీదున్న రొమాంటిక్ ఇంట్రెస్ట్ పోయి సందేహాలు మొదలయ్యాయి. తాను  మోసపోయానని గుర్తించింది. వెంటనే స్కామర్‌తో అన్ని సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకుంది.

తన అనుభవాన్ని తెలుపుతూ ఓ వీడియో చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. అందులో ప్రేమ ఎంత మూర్ఖమైన, అహేతుకమైన పనులకు దారితీస్తుందో మెకేలా తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఈ ఘటన వల్ల తన ప్రియమైన వారికి తాను ఎలా దూరంఅయ్యిందో అన్న బాధ ఆమె మఈ స్కామర్‌లచే దోపిడీ చేయబడే దుర్బలత్వంగా ఆమె ముఖంలో కనిపించింది. 

Latest Videos

click me!