Holi Offer : 1,199 రూపాయలకే విమాన ప్రయాణం... రేపే లాస్ట్ డేట్, వెంటనే టికెట్ బుక్ చేసుకొండి

Published : Mar 11, 2025, 10:26 PM IST

Holi Offer: విమాన ప్రయాణం ఇప్పుడు ట్రైన్ టికెట్ ధరకే!  మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ట్రైన్ కంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ బెటర్... కారుచౌకగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకూ ఈ ఆఫర్ ఏంటో తెలుసా?  

PREV
15
Holi Offer : 1,199 రూపాయలకే విమాన ప్రయాణం... రేపే లాస్ట్ డేట్,  వెంటనే టికెట్ బుక్ చేసుకొండి
Holi Offer

ఇండిగో ఎయిర్‌లైన్స్ హోలీ పండుగ కోసం సూపర్ ఆఫర్ తెచ్చింది. దేశంలోనే అతిపెద్ద డొమెస్టిక్ ఎయిర్‌లైన్ ఇండిగో తమ ప్రయాణికులకు హోలీ సందర్భంగ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కింద దేశంలో, విదేశాల్లో కూడా తక్కువ ధరకే ప్రయాణించవచ్చు.

25
ఇండిగో హోలీ గెట్‌అవే ఆఫర్

ఇండిగో 'హోలీ గెట్‌అవే సేల్' స్టార్ట్ చేసింది. ఇందులో తక్కువ ధరకే ఫ్లైట్స్ బుక్ చేసుకోవచ్చు. మార్చి 10 నుంచి ఈ సేల్ మొదలైంది. మార్చి 12 వరకు ఉంటుంది. మార్చి 17, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

35
హోలీ ఆఫర్ లో ఇండిగో ఫ్లైట్ టికెట్ ధరలు ఎంతంటే..

'హోలీ గెట్‌అవే సేల్'లో ఇండిగో వన్-వే టికెట్లను ₹1,199 నుంచి స్టార్ట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ టూర్స్ కోసం టికెట్లు ₹4,199 నుంచి మొదలవుతాయి. అదనంగా ఇండిగో యాడ్-ఆన్స్‌పై డిస్కౌంట్స్ ఇస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టికెట్లపై 15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీల ప్రీపెయిడ్ ఎక్స్‌ట్రా లగేజీపై 20% వరకు తగ్గింపు పొందండి.

45
ఇండిగో మరిన్ని ఆఫర్లు

ఈ ఇండిగో ఆఫర్ కింద మీకు ఇష్టమైన సీటును బుక్ చేసుకోవాలనుకుంటే 35 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఫుడ్‌పై కూడా 10 శాతం డిస్కౌంట్ ఉంది. ఎమర్జెన్సీ XL సీటు ధర డొమెస్టిక్‌లో ₹599 నుంచి, ఇంటర్నేషనల్‌లో ₹699 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్‌పై 50% వరకు, 6E ప్రైమ్, 6E సీట్ & ఈట్‌పై 30% వరకు తగ్గింపు పొందండి.

55
ఇండిగో వెబ్‌సైట్, యాప్‌లో 5% డిస్కౌంట్ అదనం

వీటన్నిటితో పాటు ఇండిగో వెబ్‌సైట్ లేదా ఇండిగో మొబైల్ యాప్ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్‌పై 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ఆఫర్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

click me!

Recommended Stories