భారతీయ రైల్వే లగేజ్ నియమాలు
ఏప్రిల్ 2025 నుంచి, భారతీయ రైల్వే వేర్వేరు ప్రయాణ తరగతుల్లో ప్రయాణించే ప్రయాణికులందరికీ లగేజ్ నియమాలను సవరించింది. ప్రయాణికుల ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడమే దీని లక్ష్యం. కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా 70 కిలోల వరకు సామాను తీసుకెళ్లొచ్చు.
రైల్వే కొత్త రూల్స్
ఒక ప్రయాణికుడు అనుమతించిన బరువు కంటే ఎక్కువ సామాను తీసుకెళ్తే, అదనపు ఛార్జీ పడుతుంది. కాబట్టి బరువు చూసుకొని వెళ్లడం మంచిది. సామాను కోసం గరిష్టంగా అనుమతించే కొలతలు (పొడవు + వెడల్పు + ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండకూడదు. గుర్తుంచుకోండి.
ట్రెయిన్‌లో నిషేధించిన వస్తువులు
ప్రయాణికులు ట్రెయిన్ బోగీల్లో తీసుకెళ్లకూడని నిషేధిత వస్తువుల గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. మద్యం, పేలుడు ఉత్పత్తుల్లాంటివి అందులో కొన్ని. పూర్తి వివరాలకు రైల్వే వెబ్సైట్లో చూడవచ్చు.