Summer Trip: గోవా కంటే తక్కువ ఖర్చుతో విదేశాలకు.. ఎలానో తెలుసా?

Published : Apr 15, 2025, 05:25 PM IST

పిల్లలకు సమ్మర్ హాలీడేస్ వచ్చాయి కదా.. ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే.. తక్కువ ఖర్చుతో విదేశాల్లో సమ్మర్ ఎలా ఎంజాయ్ చేయచ్చో.. దాని కోసం ఏ దేశాలను ఎంచుకోవాలో తెలుసుకుందాం..

PREV
17
Summer Trip: గోవా కంటే తక్కువ ఖర్చుతో విదేశాలకు.. ఎలానో తెలుసా?


వేసవి సెలవులు వచ్చేసాయి !
సంవత్సరానికి...  ఒక్క సారైనా , బయటి ప్రాంతాలకు టూర్ వెళ్ళాలి అనుకొనేవారి సంఖ్య...   కరోనా తరువాత బాగా పెరిగింది .  .
"స్వదేశీ టూర్స్ చీప్ .. అదే విదేశాలకు వెళ్లడం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం" అని చాలా మంది అనుకుంటారు. కానీ సరిగా ప్లాన్ చేసుకొంటే ఒక మాదిరి బడ్జెట్ తో విదేశాలకు వెళ్లి రావొచ్చు .

సుమారుగా 25 దేశాలు చూసిన { అమెరికా , సింగపూర్ , మలేషియా  నాలుగు సార్లు , జపాన్ రెండు సార్లు } అనుభవం తో నా విశ్లేషణ . 
ముఖ్య గమనిక .. నా అభిరుచి బట్టి నేను రేటింగ్ ఇస్తున్నాను .అందరి అభిరుచి నాలాగే ఉండాలని లేదు అని గమనించగలరు.ఇంకో మాట .. ఇక్కడ నేను ఇచ్చిన రేటింగ్ భారతీయ టూరిస్ట్ ల కోణం లోనిది .
 

27

1     థాయిలాండ్ .
 థాయిలాండ్ అనే  మాట బూతుకు పర్యాయ పదం అయ్యింది . ఇది కేవలం" పురుషులు...   ఆ సుఖం కోసం వెళ్లే ప్రాంతం .. కుటుంబాలు వెళ్లే  ప్రాంతం కాదు" అని తొంబై శాతం అనుకొంటారు . నిజమే .. సోపి మసాజ్ లు .. గో గో బార్ లు.. ఇలాంటి టూరిస్ట్ ల కోసం అక్కడ వెలిసాయి . 
కానీ...  ఇంకో కోణం ఏంటంటే .. పిల్లలతో కుటుంబం తో వెళ్లి .. అదీ అతి తక్కువ బడ్జెట్ తో .. గోవా టూర్ కు వెళ్లిన దానికంటే తక్కువ ధరలో ఎంజాయ్ చేయవచ్చు . 
బ్యాంకాక్ లోని సఫారీ వరల్డ్ ఒక్కటి చాలు .. పిల్లలు  మరో లోకం లోకి వెళ్లి పోతారు . ఎక్కడో దూరంలోని కెరిబియన్ దీవులకన్నా..  మారిషస్ దీవులకన్నా .. ఫుకెట్ బీచ్ లు అద్భుతం .  ఇంద్ర మాల్ .. బాబే మార్కెట్ లలో తక్కువ ధరకు దుస్తులు కొనుక్కోవచ్చు . మీరు టూర్ కు ఖర్చు పెట్టిన డబ్బులు షాపింగ్ ద్వారా ఆదా చేసినట్టే .{ అదే దుస్తులు ఇండియా లో కొంటే ఎంత ధర . అక్కడ కొనడం వల్ల ఎంత ఆదా.. అనే ప్రాతిపదికన .} 
 నా దృష్టిలో థాయిలాండ్ నెంబర్ టూరిస్ట్ డెస్టినేషన్ . 9 / 10 .
 థాయిలాండ్ కు వెళితే కొబ్బరి నీరు  తప్పక తాగండి .
 తాటి నుంజేల నీరు లా ఉంటుంది .
 

37

2 . న్యూ జిలాండ్.
 దూరంగా ఉండడం వల్ల ఫ్లైట్ టికెట్ ధర ఎక్కువ . 
 కాస్ట్లీ దేశం .  టూర్ కాస్ట్ కూడా .. బాగా ఎక్కువ . 
బడ్జెట్ తో సమస్య లేదు అనుకున్నవారు జీవితం లో ఒక్క సారైనా చూడాల్సిన ప్రదేశం .
 క్వీన్స్ టౌన్ లో బంగీ జుంపింగ్,  స్కై డైవింగ్ ముగించుకొని...  మరుసటి  రోజు...  మిలీఫోర్డ్ సౌండ్ కు...  బస్సు లో వెళుతుంటే మనుషులు లేని కొత్త ప్రపంచానికి వెళ్లిన అనుభూతి .
 అక్కడి నదుల్లోని నీరు మినరల్ వాటర్ కన్నా స్వచ్ఛం . అలాగే తాగొచ్చు.
  అదో అద్భుత లోకం . 
సమస్య ఒక్కటే .. ఖర్చు .
 8 .5 / 10 .
 

47
dubai roads

౩. దుబాయ్ .
 ప్రపంచం లోని అన్ని వింతలూ ఇక్కడే ఉన్నాయి. 
అసలు సిసలు కేరళ ఫుడ్ , తమిళనాడు ఫుడ్ ఇక్కడే దొరుకుతాయి . బడ్జెట్ కూడా ఎక్కువ కాదు . 
డెసర్ట్ సఫారీ చేస్తుంటే .. జీప్ లు .. సినిమాల్లో కన్నా ఎక్కువ గిరికీలు కొడుతుంటే అడ్రినాలిన్ హై తో ఉక్కిరి బిక్కిరి అవుతారు . 
8 .5 / 10 .

4 . కెన్యా .
 మాసాయి మారా అంటే అదో లోకం . 
కళ్ళ ముందే  గుంపులు గుంపులుగా సింహాలు .. మందలు మందలుగా అడవి దున్నలు .
 సింహం.. 
 అడవి దున్న గొంతు కొరికి...  రక్తం తాగి .. నోరు..  జూలు .. ఎర్రగా  చేసుకొని ఎండ లో మత్తుగా పడుకొని ఉంటే చూడడానికి గుండె దిట్టం చేసుకోవాలి . 
పొద్దున్న ఆరు గంటలకు హాట్ ఎయిర్  బెలూన్ ఎక్కి .. అడవి పై విహారం చేసి .. ఎనిమిది గంటలకు ఎక్కడో అడవి మధ్యలో క్రూర  మృగాల మధ్య దిగి .. టిఫిన్ చేస్తుంటే .. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కే వాడు షాంపెయిన్ ఇస్తే .. మీరు అవాక్కు కావడం ఖాయం . 8 / 10 .
 

57

నా దృష్టిలో టాప్ టూర్స్ ఇవే .
రేటింగ్ కు అతీతం గా నిలిచే కొన్ని టూర్స్ .
  1    జపాన్ .. 
ఇదో లైఫ్ స్కిల్స్ టూర్ . 
జపాన్ ప్రజల  క్రమశిక్షణ చూసి తీరాల్సిందే .
 హిరోషిమా కు వెళితే గుండె చెరువు అయిపోతుంది . మాటలకందని విషాదం అది .

 2    మారిషస్ . ఎక్కడో వేల మైళ్ళ కవితల మినీ ఇండియా . 
అక్కడికి వెళితే మీరు విదేశాలకు వెళ్లినట్టు ఉండదు . 
కరీంనగర్ లోనో కాకినాడ లోనో ఉన్నటు ఉంటుంది .
 సంజీవ నరసింహ అప్పుడు { రేడియో మారిషస్ వ్యాఖ్యాత }.. ఇంటికి తీసుకొని వెళ్లి  తెలుగు భోజనం పెట్టి .. గుళ్ళు గోపురాలు తిప్పు తుంటే .. నేను లోకాన్ని మరిచి పోయాను .
 

67

3    చైనా .. 
అచ్చం మనలా ఉంటారు.
 రోడ్డులపై గుప్పు గుప్పు మని సిగరెట్ పొగలు .. కింద సిగరెట్ పీకలు ..
 డబ్బులు పెట్టి ఎందుకు వచ్చామురా బాబూ? .. అని మీరు అనుకునేంత లోగానే .. వారి బులెట్ ట్రైన్స్ , గ్రేట్ వాల్ అఫ్ చైనా మమ్మల్ని చరిత్ర నుంచి భవితకు తీసుకొని వెళ్లిపోతాయి .
 

77

 మలేషియా .. మా     బంధువులు యాభై కి పైగా కుటుంబాలు .. 
ఇది నాకు ఫామిలీ టూర్ . 
పేరు గొప్ప .. కానీ .. 
 1 .  సింగపూర్ . 
అద్దాల మేడ.
 వారి మాస్ రాపిడ్ ట్రాన్సిట్ రైలు లో వెళ్లి లిటిల్ ఇండియా చూడాల్సిందే .
 మిగతా విషయాల్లో ఇదొక అర్బన్ టూర్ . 
నగరాల్లో వున్నవారికి ఒక నగరం నుంచి ఇంకో నగరానికి వెళ్లినట్టు ఉంటుంది .. 
సింగపూర్ .. మొత్తం దేశం ఒక  ఫైవ్ స్టార్ హోటల్ . అంతే .
 6 / 10 .

   యూరోప్ టూర్ .
 భారతీయుల నెంబర్ వన్ ఎంపిక .
 ఈఫిల్ టవర్ .. లీనింగ్ టవర్ అఫ్ పీసా ..  ఒకటా రెండా .. అన్నీ  అద్భుతాలే .     చూడాల్సినవే  . 
కానీ సమ్మర్ లో...  టూర్ కంపెనీ లు ఏర్పాటు చేసే బడ్జెట్ టూర్ లో వెళితే...  బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది . 
లంచ్ కోసం గంట క్యూ లో నిలబడి .. ముద్దగా మారిన అన్నాన్ని...  నీళ్ల  సాంబార్ తో  తింటూ ఉంటే నరకం కనిపిస్తుంది . 
మేము తొలిసారి 2007 లో వెళ్ళాము . ఒళ్ళు మండి.. జర్మనీ  బ్లాక్  ఫారెస్ట్ నుంచి లైవ్ ...  టీవీ 9 లో ..
 అటుపై 2013 లో రోమ్ కాళోజీయం ఉంచి...  ఈటీవీ లైవ్ లో ..
 విదేశీ టూర్ కంపెనీ ల ను చీల్చి చెండాడను.
 ముంబై సెంట్రల్ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా వారి ఎగ్జిక్యూటివ్స్ వచ్చి .. సారీ చెప్పి .. టూర్ లో నాతో బాటు ఉన్న నలబై మందికి రెండు  రోజులు స్పెషల్ టూర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు . 
ఒక్క మాటలో చెబుతా .. సమ్మర్ లో ..
 అదీ టూర్ కంపెనీ ల బడ్జెట్ టూర్ లో వెళ్లొద్దు .
 5  / 10 

    అమెరికా .. తొలి సారి నయాగరా .. స్టాచ్యూ అఫ్ లిబర్టీ .. యోసెమిటి..  యూనివర్సల్ స్టూడియో...  గ్రాండ్ కెన్యాన్ లాంటివి చూస్తుంటే .. 9 / 10 . 
నాలుగో సారి...  అదీ...  ఎకానమీ క్లాసులో విమానం ఎక్కి .. టాయిలెట్ ల ముందు అరగంట నిలబడి .. 27  గంటల తరువాత దిగి .. జెట్ లాగ్ తో .. అక్కడి చలిలో .. చూడడానికి ఇక ఏమీ మిగలక హోటల్ రూమ్ లో బోర్ కొడుతుంటే .. ఇక అమెరికా వద్దు రా దేవుడా అనిపిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories