నిమ్మకాయలే కాదు.. వాటి తొక్కలతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మ తొక్కల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
నిమ్మ తొక్కలు చర్మ ఆరోగ్యానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన నిమ్మ తొక్కలు.. చర్మాన్ని కాంతివంతం చేసే అనేక గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణకు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మరి నిమ్మతొక్కలను ఎలా వాడితే మంచి ఫలితాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
26
కాంతివంతమైన చర్మం
నిమ్మ తొక్కలలోని సిట్రిక్ యాసిడ్ చర్మ కాంతిని పెంచడానికి సహాయపడుతుంది. మృత కణాలను తొలగిస్తుంది. చర్మ రంగును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
36
మొటిమలు, మచ్చలు మాయం
నిమ్మ తొక్కల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మాన్నిలోపలి నుంచి శుభ్రం చేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.