ప్రెషర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయిందా? పైసా ఖర్చు లేకుండా ఇలా సరిచేయండి!

Published : Sep 22, 2025, 06:52 PM IST

ప్రెషర్ కుక్కర్ ని మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. అయితే రోజూ వాడటం వల్ల కుక్కర్ రబ్బర్ లూజు అవుతుంటుంది. దానివల్ల అది సరిగ్గా పనిచేయదు. అయితే పైసా ఖర్చు లేకుండా ప్రెషర్ కుక్కర్ రబ్బరును సులభంగా ఫిక్స్ చేయవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం. 

PREV
16
Pressure Cooker:

ఈ రోజుల్లో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు లేదు. బియ్యం, పప్పు, కూరగాయల నుంచి మాంసం వరకు అన్ని వంటలు దానిలోనే చేస్తుంటాం. ప్రెషర్ కుక్కర్ లో వంట త్వరగా పూర్తవుతుంది. టైం సేవ్ అవుతుంది కాబట్టి.. ఎక్కువ మంది ప్రెషర్ కుక్కర్ ని వాడుతుంటారు. అయితే దాంట్లోనే రోజూ వంట చేయడం వల్ల అప్పుడప్పుడు కుక్కర్ రబ్బర్ లూజు అవుతుంటుంది.

26
ప్రెషర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయితే ఏం చేయాలి?

ప్రెషర్ కుక్కర్ రబ్బర్ లూజ్ అయితే మూత సరిగ్గా పట్టదు. విజిల్ రాదు. కుక్కర్ లోని ఆహారం, నీళ్లు బయటకు లీక్ అవుతాయి. దానివల్ల గ్యాస్ పైనా, చుట్టు పక్కలా మరకలు పడిపోతాయి. అయితే ఈ సమస్యను పైసా ఖర్చు లేకుండా సులభంగా పరిష్కరించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

36
ఫ్రిజ్‌లో పెట్టండి :

వంట చేయడానికి ముందు కుక్కర్ రబ్బర్‌ను 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి. ఇలా చేస్తే ఫ్రిజ్ లోని చల్లదనం వల్ల రబ్బర్ కుంచించుకుపోతుంది. కుక్కర్ మూతకు సులభంగా సరిపోతుంది. 

46
పిండి రాయడం :

మరో పద్ధతి ఏంటంటే.. ప్రెషర్ కుక్కర్ రబ్బర్‌పై కొద్దిగా గోధుమ పిండి లేదా ఏదైనా పొడి పిండిని రాసి మూతకు అమర్చితే సులభంగా సరిపోతుంది. వంట చేసేటప్పుడు విజిల్ కూడా వస్తుంది. 

56
ఐస్ వాటర్ :

ఐస్ వాటర్‌లో కూడా కుక్కర్ రబ్బర్‌ను పెట్టవచ్చు. ఇది రబ్బర్‌ను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల రబ్బర్.. కుక్కర్ మూతకు బాగా సరిపోతుంది. కుక్కర్ లోని పదార్థాలు బయటకు లీక్ కాకుండా ఉంటాయి.

66
రబ్బర్ కడిగే పద్ధతి :

కుక్కర్ రబ్బర్‌ను సరిగ్గా కడగకపోయినా త్వరగా లూజ్ అవుతుంది. కాబట్టి కుక్కర్‌ ఉపయోగించిన ప్రతిసారీ కుక్కర్ తోపాటు రబ్బర్ ను బాగా కడిగి ఆరబెట్టాలి. 

Read more Photos on
click me!

Recommended Stories