భద్రాచలం : తెలంగాణలోని భద్రాచలంలో ఓ మహిళ అనుమానాస్పద మృతి విషయంలో ఆమెకు అల్లుడి వరస అయ్యే వ్యక్తి మీద కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పట్టణంలోని ఓ లాడ్జిలో రావూరి అరుణ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా ఆమెను హత్య చేసినట్లుగా అరుణ కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.