మేనల్లుడితో కూతురు లవ్: మంచిర్యాలలో బీరులో మందు కలిపి అల్లుడి హత్య

First Published | Apr 18, 2023, 10:48 AM IST

మంచిర్యాల జిల్లాలోని  లక్సెట్టిపేటలో  అనిల్ అనే యువకుడిని మేనమామ  గడ్డిమందు తాగించి హత్య చేశాడు.  తన కూతురిని  ప్రేమించినందుకు  గాను  బీరులో  గడ్డిమందు కలిపి   తాగించాడు.

లవ్

జిల్లాలోని  లక్సెట్టిపేటలో  దారుణం  చోటు  చేసుకుంది.  తన  కూతురిని  ప్రేమించాడని  మేనల్లుడికి గడ్డి మందు కలిపిన బీరు తాగించాడు మామ.   గడ్డిమందు కలిపిన బీరు  తాగిన అనిల్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  మృతి చెందాడు. 

లవ్

 ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న సమయంలో అనిల్  రికార్డు  చేసిన  సెల్ఫీ వీడియో  ప్రస్తుతం  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. ఈ వీడియో ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 


లవ్


జిల్లాలోని దండేపల్లి మండలం  గూడెం  గ్రామానికి  చెందిన   దుడ్డంగుల  అనిల్. తన మేనమామ కూతురును ప్రేమించాడు. ఈ విషయం  అనిల్ మామకు తెలిసింది.  ఈ విషయమై  అనిల్ ను  మామ మందలించాడు.  

లవ్

 కానీ అనిల్ ప్రవర్తనలో మార్పు రాలేదు.  దీంతో  అనిల్   ను అంతమొండించాలని  మామ  ప్లాన్  చేశాడు.  ఫోన్  చేసి అనిల్ ను  పిలిపించాడు .  బీరులో  గడ్డిమందు  కలిపి అనిల్ కు తాగించాడు  మామ.  ఈ బీరు  తాగిన అనిల్  అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.  

లవ్

అనిల్ అపస్మారక స్థితిలో  ఉన్న  అనిల్ ను గుర్తించిన  స్థానికులు  అతడిని  ఆసుపత్రిలో  చేర్పించారు.  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  అనిల్ మృతి చెందాడు.  ఆసుపత్రిలో  చికిత్స  పొందే  సమయంలో  తన మామ  తనపై  విష ప్రయోగం  చేసినట్టుగా అనిల్  సెల్ఫీ వీడియో రికార్డు  చేశాడు.బీరులో  గడ్డి మందు కలిపి  తనతో బలవంతంగా తాగించాడని  ఆ వీడియోలో  పేర్కొన్నారు. తనను కత్తితో  బెదిరించాడని  కూడా ఆ వీడియోలో  చెప్పారు. 

లవ్

అనిల్  మృతిపై  పోలీసులు  కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.తాజాగా అనిల్  సెల్ఫీ వీడియో  సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ వీడియో  అనిల్  రికార్డు చేశాడా,  ఈ  వీడియోలో  అనిల్  చేసిన ఆరోపణలపై కూడా  పోలీసులు దర్యాప్తు  చేసే అవకాశం ఉంది

లవ్

కూతురును అల్లుడికి ఇచ్చి వివాహం  చేయడం ఇష్టం లేని  మామ నచ్చజెప్పాల్సింది పోయి  అల్లుడిని  చంపాడు.  ఈ ఘటన అనిల్ కుటుంబంలో  విషాదాన్ని నింపింది. అనిల్ హత్యకు కారణమైన  నిందితుడిని కఠినంగా శిక్షించాలని  బాధిత కుటుంబం  కోరుతుంది

లవ్


ప్రేమ వ్యవహరాలతో   దారుణంగా  హత్యలు  చేసిన ఘటనలు  అనేకం రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు  చేసుకున్నాయి.   గతంో  తెలుగు రాష్ట్రాల్లో జరిగిన  పరువు హత్యలు  దేశ వ్యాప్తంగా కలకలం  రేపాయి.  సమీప బంధువుల కుటుంబాల పిల్లలు  ప్రేమించుకున్నా కూడా  వీరిద్దరి పెళ్లికి  అంగీకరించలేదు.

Latest Videos

click me!