విషాదం : కోతుల దాడిలో బండరాయి పడి, తల పగిలి రెండున్నరేళ్ళ చిన్నారి మృతి..

Published : Apr 18, 2023, 08:50 AM IST

మెడకు కత్తిగాయం నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన చిన్నారిని మృత్యువు వెంటాడింది. కోతులు బండరాయి పడేయడంతో తల పగిలి దుర్మరణం పాలయ్యాడు. 

PREV
15
విషాదం : కోతుల దాడిలో బండరాయి పడి, తల పగిలి రెండున్నరేళ్ళ చిన్నారి మృతి..

సిద్దిపేట : మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిని పలకరిస్తుందో చెప్పలేం. ఒకచోట తప్పించుకున్నామనుకుంటే మరోచోట కాపు కాచి కాటేస్తుంది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి విషయంలో ఇదే జరిగింది. మొదట గడప దాటబోయి కాలు జారిపడి తీవ్రస్వస్థతకు లోనవ్వడంతో.. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు. కోలుకున్నాడు అనుకుని..  సంతోషించేలోపే.. మృత్యువు కోతుల రూపంలో వెంటాడింది. పైకప్పుపై పెట్టిన బండను దొర్లించడంతో చిన్నారి తలపై పడి దుర్మరణం పాలయ్యాడు.

25

దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గ్రామీణ, అక్కపేటకు చెందిన ఓ ఇంట్లో రెండున్నర ఏళ్ల చిన్నారి కోతుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ చిన్నారికి ఇటీవల ప్రమాదవశాత్తు గాయం కావడంతో నాలుగు లక్ష రూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు. బిడ్డ కోలుకుని ఇంట్లో తిరుగుతున్నాడని సంతోషించేలోపే ఆ కుటుంబాన్ని ఈ విషాదం ముంచేసింది 

35

సోమవారం అక్కన్నపేట మండలం కట్కూరులో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. దీనిమీద సర్పంచి జిల్లెల్ల అశోక రెడ్డి మాట్లాడుతూ.. కట్కూరు గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్, రజిత దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. వారికి చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో రెండు గదులు స్ల్లాబ్ ఉండగా.. వంటగది రేకులతో ఉంది. రెండింటి మధ్య.. గాలి వెలుతురు కోసం ఖాళీ ప్రదేశం ఉంది. అయితే, ఆ ఖాళీ ప్రదేశంలో స్లాబు పైనుంచి తడకపెట్టి..  అది గాలికి ఎగిరిపోకుండా ఓ బండరాయి ఉంచారు.

45

సోమవారం నాడు ఆ ఖాళీ ప్రదేశాల నుంచి కోతులు ఇంట్లోకి వచ్చాయి. అది గమనించిన రజిత  కోతులను వెల్లగొట్టేందుకు వంటింట్లోకి వెళ్ళింది. రెండున్నరేళ్ల చిన్నకొడుకు అభినవ్  అక్కడే ఉన్నాడు. ఆమె కోతులను వెలగొట్టే సమయంలో కోతులు వచ్చినదారి గుండానే బయటికి వెళ్లడానికి.. ఇంటి పైకప్పుకు ఎక్కి తడక మీదికి ఎగిరాయి. తడక మీద అది ఎగిరిపోకుండా పెట్టిన బండరాయి కోతులు ఎగరడంతో కదిలి.. కింద ఉన్న అభినవ్ తల మీద పడింది. 

55

దీంతో అభినవ్ తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. అంతకు నెల క్రితమే అభినవ్ ఓ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాడు.  ఇంట్లో గడప దాటుతుంటే కాలుజారి.. పక్కనే ఉన్న కత్తి మీద పడ్డాడు. దీంతో గొంతు కొంతమేర తెగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు అతి కష్టం మీద అతడిని రక్షించారు. దీనికి ఆ నిరుపేద తల్లిదండ్రులు దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. బిడ్డ దక్కిందన్న సంతోషం వారికి నెలరోజులు కూడా మిగలకుండానే కోతులు గుండె కోత మిగిల్చాయి.

click me!

Recommended Stories