లేటు వయసులో బిడ్డను కని.. నామోషీ అనుకుని వదిలేసి.. కన్నప్రేమతో తిరిగొచ్చి...

Published : Jul 06, 2023, 02:01 PM IST

ఓ మహిళ లేటు వయసులో బిడ్డను ప్రసవించింది. దీంతో నామోషీగా భావించి ఆస్పత్రిలో వదిలేసి వెళ్లింది. కానీ తెల్లారే తిరిగివచ్చి బిడ్డను అక్కున చేర్చుకుంది. 

PREV
17
లేటు వయసులో బిడ్డను కని.. నామోషీ అనుకుని వదిలేసి.. కన్నప్రేమతో తిరిగొచ్చి...

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఓ తల్లి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువును వదిలేసి వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ తెల్లారి వచ్చి తన శిశువు తనకు కావాలంటూ అక్కున్న చేర్చుకుంది. వదిలేయాలన్న వదులుకోలేకపోయాను అంటూ కన్నీటి పర్యంతమయింది.

27

అయితే, ఆమెకు అప్పటికే పిల్లలు మనవలు మనవరాలు ఉండడంతో.. ఈ వయసులో మళ్లీ పిల్లలు కనడానికి నామోషిగా భావించి వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది.కానీ కడుపు తీపి.. వీటన్నింటినీ అధిగమించేలా చేయడంతో తిరిగి వచ్చి తన కడుపు పంటను మళ్ళీ అక్కున చేర్చుకుంది.  దీనికి సంబంధించిన వివరాలను సంగారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి,  జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణకులు అనిల్ ఈ మేరకు తెలిపారు.. 

37

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  ప్రసవం ఎక్కడో అయ్యింది. ఆ చిన్నారిని తీసుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. చిన్నారికి వైద్య చికిత్స కావాలంటూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేర్పించింది.

47

ఆ తర్వాత కాసేపటికి బాత్రూంకి వెళ్లి వస్తానంటూ.. అక్కడున్న వైద్య సిబ్బందికి చెప్పింది. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన వైద్యులు అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాల పుటేజిని పరిశీలించారు.

57

అందులో మహిళ బిడ్డతో ఆసుపత్రిలోకి రావడం.. అక్కడి నుంచి ఒంటరిగా వెళ్లిపోవడం నమోదయ్యాయి. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే, విచిత్రంగా బుధవారం సాయంత్రం ఆ మహిళా మళ్ళీ తిరిగి వచ్చింది. తన బిడ్డను తనకు ఇవ్వాలని వైద్యులను కోరింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

67

వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు బాలింతతో మాట్లాడారు.  సిసి ఫుటేజీని పరిశీలించారు. ఆమె చెప్పిన వివరాలను సరిపోల్చుకున్నారు. ఆ తర్వాత శిశువును అప్పగించారు. ఎందుకు వదిలేసి వెళ్లిందో ఆరా తీయగా…ఆ మహిళలకు ఇప్పటికే పెళ్ళై సంతానం ఉంది.  వారికి పెళ్లిళ్లై మనవలు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. 

77

ఇప్పుడు మళ్లీ  బిడ్డ పుట్టడంతో ఆమె నామోషీగా భావించింది. దీంతో శిశువును వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత బిడ్డ మీద మమకారం ఆమెను తిరిగి ఆస్పత్రికి వచ్చేలా చేసింది. శిశువు క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు. బిడ్డను తల్లి తీసుకెళ్లడంతో దీని మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు వివరించారు. 

click me!

Recommended Stories