ఈటలకు పెద్దపీట వేసిన బీజేపీ : కేసీఆర్ వ్యూహాలకు చెక్ పెట్టేనా?

First Published | Jul 4, 2023, 5:53 PM IST

బీజేపీ  ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ పదవికి  ఈటల రాజేందర్ కు అప్పగించింది  ఆ పార్టీ నాయకత్వం.

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

 మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  బీజేపీ నాయకత్వం  పార్టీలో అధిక ప్రాధాన్యత  ఇచ్చింది.  బీజేపీ ఎన్నికల  మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ గా   ఈటల రాజేందర్ ను  ఆ పార్టీ నాయకత్వం నియమించింది.

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

కేసీఆర్ మంత్రివర్గంలో  ఉన్న  సమయంలో ఈటల రాజేందర్ సై భూకబ్జా ఆరోపణలు  వచ్చాయి.  ఈ ఆరోపణల  నేపథ్యంలో  ఈటల రాజేందర్ ను  కేబినెట్ నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు. కేసీఆర్ పై బీఆర్ఎస్ నాయకత్వం వేటేసింది.  
ఈ పరిణామాల నేపథ్యంలో  ఈటల రాజేందర్ బీజేపీలో  చేరారు. బీజేపీలో చేరడానికి ముందు ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేశారు. 


ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి   ఈటల రాజేందర్ విజయం సాధించారు. హుజూరాబాద్ లో  ఈటల రాజేందర్ గెలుపు  బీజేపీకి రాష్ట్రంలో మరింత ఊపును తీసుకువచ్చింది.

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

ఈటల రాజేందర్ కు  పార్టీ మరింత ప్రాధాన్యత  ఇవ్వడం ద్వారా  బీఆర్ఎస్ కు  రాజకీయంగా చెక్ పెట్టే  అవకాశం ఉందని పార్టీ జాతీయ నాయకత్వం  ప్లాన్ చేసిందనే  అభిప్రాయాలను విశ్లేషకులు  వ్యక్తం  చేస్తున్నారు. 

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

తెలంగాణలో  బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. బీసీ సామాజిక వర్గానికి  చెందిన ఈటల రాజేందర్ కు  పార్టీలో  కీలకమైన పదవిని ఇవ్వడం ద్వారా బీసీ ఓటర్లను తమ వైపునకు  తిప్పుకొనే  అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం అభిప్రాయంతో ఉంది. 

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

ఈటల రాజేందర్  బీజేపీలో చేరిన తర్వాత  అమిత్ షా  ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  న్యూఢిల్లీకి తరచుగా వెళ్తూ పార్టీ అగ్రనేతలతో  ఈటల రాజేందర్  సమావేశాలు  నిర్వహిస్తున్నారు. తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై   పార్టీ నేతలతో  ఈటల రాజేందర్ చర్చించారు. 

ఈటలకు కీలక పదవి: రాజేందర్ కు పెద్దపీట వేసిన బీజేపీ

బీఆర్ఎస్ లో  సుదీర్ఘంగా  పనిచేసిన ఈటల రాజేందర్ కు కేసీఆర్ వ్యూహాలపై అవగాహన ఉంది. ఈటల రాజేందర్  బీజేపీ వ్యూహాలకు  రాజకీయంగా  పనికొచ్చే అవకాశం ఉందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  రాజేందర్ వ్యూహాలు  కేసీఆర్ కు చెక్ పెడుతాయా లేదా అనేది ఫలితాలు తేల్చనున్నాయి.

Latest Videos

click me!