తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

First Published | Jul 5, 2023, 12:30 PM IST

బీజేపీలో  చోటు  చేసుకున్న అంశాలను తమకు అనుకూలంగా  మలుచుకునేందుకు  కాంగ్రెస్ నేతలు  ప్రయత్నిస్తున్నారు.  బీజేపీలో అసంతృప్తితో ఉన్న  కొందరు  నేతలతో  కాంగ్రెస్  చర్చలు జరుపుతుంది.

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

బీజేపీ తెలంగాణలో  చోటు  చేసుకున్న పరిణామాలను తమకు  అనుకూలంగా  మార్చుకోనేందుకు  కాంగ్రెస్  పార్టీ నాయకత్వం ప్రయత్నాలు   చేస్తుంది.  ఇప్పటికే  కొందరు  బీజేపీ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.  ఈ క్రమంలోనే  నిన్న  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు  మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డితో చర్చించారు.

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

బండి సంజయ్ ను  బీజేపీ అధ్యక్ష పదవి నుండి  తప్పించడంతో   పార్టీలో  ఆయన  వర్గీయులు అసంతృప్తితో ఉన్నారు. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవిలో  కొనసాగించాలని  కోరే  నేతలు  ఏం చేస్తారని  ప్రస్తుతం  అంతా ఆసక్తిగా  చూస్తున్నారు.  గతంలో కాంగ్రెస్ తో పాటు  ఇతర పార్టీల నుండి బీజేపీలో  చేరిన  నేతలతో  కాంగ్రెస్ నాయకత్వం  చర్చిస్తుంది.  ఇతర రాష్ట్రాల్లో  బీజేపీ అసంతృప్తులతో  కాంగ్రెస్ నాయకత్వం  చర్చిస్తుందని  సమాచారం. గతంలో తెలంగాణ  కాంగ్రెస్ పార్టీకి ఇంచార్జీగా ఉన్న కాంగ్రెస్ నేత  బోస్ రాజు  ఈ వ్యవహరంలో  కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

Latest Videos

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

ప్రస్తుతం  బీజేపీలో ఉన్న గందరగోళ పరిస్థితులను  తమకు అనుకూలంగా మలుచుకోవాలని  కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు  కొందరు కాంగ్రెస్ నేతలు  బీజేపీలోని అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు.

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

గతంలో కాంగ్రెస్ పార్టీలో  కీలకంగా పనిచేసి  బీజేపీలో చేరిన నేతలపై   కాంగ్రెస్ నాయకత్వం  కేంద్రీకరించింది.  పార్టీని వీడిన వారంతా  తిరిగి  పార్టీలోకి రావాలని  రాహుల్ గాంధీ  కూడ ఆహ్వానించారు. 

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.  ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  వ్యూహాలు రచిస్తుంది. 

తెలంగాణ బీజేపీలో అసంతృప్తులకు గాలం: చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది.  ఈ పరిణామం  తెలంగాణ నేతల్లో  ఉత్సాహం నింపింది. కర్ణాటకలో తరహాలోనే  పార్టీ నేతలంతా తమ మధ్య అబిప్రాయబేధాలను పక్కన పెట్టి ఎన్నికల్లో పనిచేయాలని  పార్టీ నాయకత్వం  సూచించింది.  పార్టీ జాతీయ నాయకత్వం  సూచన మేరకు  పార్టీ నేతలు  తమ మధ్య ఉన్న గ్యాప్ అభిప్రాయబేధాలను పక్కన పెట్టారు. 

click me!