వార్నీ.. భర్త ఇంట్లో తినడం లేదని.. భార్య ఆత్మహత్య..

First Published | Jul 10, 2023, 9:28 AM IST

మూడు రోజులుగా భర్త ఇంట్లో తినకపోవడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మూడు రోజులుగా భర్త.. ఇంట్లో తాను చేసిన వంట తినకుండా బయట తింటుండడంతో మన స్థాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. 

ఇంట్లో తాను చేసిన వంటలు తినకపోవడమే కాకుండా ఎందుకు తిన్నట్లేదని అడిగితే సరైన సమాధానంచెప్పకపోవడమే ఆమె ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. ఆమె ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఈ మేరకు వివరాలు తెలిపారు..


కె సంగీత (23) బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని గౌరీ శంకర్ కాలనీలో ఉంటుంది. నాలుగేళ్ల క్రితం 2019లోఆమెకు కె సంజీవ అనే వ్యక్తితో వివాహమైంది. సంజీవ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.  
కారణమేంటో తెలియదు కానీ గత మూడు రోజులుగా సంజీవ ఇంట్లో తినడం లేదు. దీంతో  వండిందంతా వృధా అవుతుందని.. పడైయాల్సి వస్తుందని.. భర్తతో చెప్పింది. అయినాఅతని వినిపించుకోలేదు. 

ఇంట్లో ఎందుకు తినడం లేదు..? బయట ఎందుకు తింటున్నారు? అని అడిగిన సమాధానం చెప్పలేదు.  దీంతో సంగీత తీవ్ర మనస్థాపానికి గురైంది. దీనికి తోడు గత కొంత కాలం గా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. 

ఈ నేపథ్యంలోనే శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో..  ఫ్యాన్ కు ఉరివేసుకొని  ఆత్మహత్య చేసుకుంది సంగీత.  ఆమె మరణ వార్త  వెలిసిన తండ్రి  సంజయ్ రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  దర్యాప్తు చేస్తున్నారు. 

Latest Videos

click me!