ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని... దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో వర్షాలు నేడు చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. సోమవారం అత్యధికంగా అల్లూరి జిల్లా రాచపనుకులులో 56 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది.