శనివారం నుంచే రాష్ట్రంలో వానలు దంచికొట్టడం స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో కూడా వానలు రికార్డ్ స్థాయిలో పడ్డాయి. మహబూబాబాద్ మరిపెడలో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల మెట్‌పల్లిలో 6.6 సెంటీమీటర్లు, కరీంనగర్ దుర్షేడు, ఇతర గ్రామీణ ప్రాంతాలో 5.9 సెంటీమీటర్లు, సూర్యాపేట ముకుందాపురంలో 5.6 సెంటీమీటర్లు, మెదక్ రామాయంపేటలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఇవే కాకుండా వెల్గటూరు, పెద్దనాగారం, సిద్దిపేట, జనగామ, భువనగిరి, ఖమ్మం, గద్వాల, నారాయణపేట, వనపర్తి లాంటి చాలా ఏరియాల్లో కూడా వానలు గట్టిగానే పడ్డాయి. రాబోయే వారం రోజుల పాటు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. ఆది, సోమవారాల్లో ఈ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఫారెస్ట్ ఏరియాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా వెదర్ చిల్ అయిపోయి, భారీగా వానలు పడనున్నాయని తెలిపింది.