IMD Coldwave Alert : తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లోనూ సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని జిల్లాల్లో చలి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Weather Updates : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. ఇప్పటికే కొన్నిజిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి... గడ్డకట్టే స్థాయిలో చలి కొనసాగుతోంది. రాబోయే నాలుగైదు రోజుల్లో చలి మరింత పెరుగుతుందని... ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
25
ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి (డిసెంబర్ 7 ఆదివారం) నుండి డిసెంబర్ 11 వరకు ఈ జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటుందని వెల్లడించింది. ఇక సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... డిసెంబర్ 7 నుండి 9 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
35
ఇవాళ ఇక్కడే అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున అత్యల్పంగా ఆదిలాబాద్ లో 8.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మెదక్ లో 11, హన్మకొండలో 12, రామగుండంలో 13.9, నిజామాబాద్ లో 14.8 డిగ్రీ సెల్సియస్ నమోదైనట్లు వెల్లడించింది. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో 12.6, హయత్ నగర్ లో 13, రాజేంద్రనగర్ లో 14.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏడు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఇలా రాబోయే నాలుగైదు రోజులు తెలంగాణవ్యాప్తంగా అత్యంత చలి వాతావరణం ఉంటుందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
55
ఏపీలోనూ గడ్డకట్టే చలి
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చలిగాలుల వీస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 9 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. అరకులోయ, పాడేరు ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొండప్రాంతాల్లో విపరీతమైన పొగమంచు కురుస్తోంది... దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. ఉదయం 9-10 గంటలవరకు చలి ఉంటోంది... తిరిగి సాయంత్రం 5-6 అయ్యిందంటే చలి మొదలవుతోంది.