ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 10 డిగ్రీలకు పైనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న (ఫిబ్రవరి 1, ఆదివారం) ఆదిలాబాద్ లో అత్యల్పంగా 13.5, మెదక్ లో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హన్మకొండలో 17.5, రామగుండంలో 17.8, నల్గొండలో 17.8, ఖమ్మంలో 18, నిజామాబాద్ లో 18, మహబూబ్ నగర్ లో 18, భద్రాచలంలో 20.2 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్స్ నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 32.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పటాన్ చెరులో అత్యల్పంగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక హయత్ నగర్ లో 15, రాజేంద్రనగర్ లో 15, హకీంపేటలో 17.2, దుండిగల్ లో 17.6, బేగంపేటలో 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యధికంగా హకీంపేటలో 29.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇవాళ(జనవరి 2, సోమవారం) హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండి ఉంటుందని... రాత్రి పొగమంచు కురిసే అవకాశాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.