Weather Update : మండుటెండల సమయంలో వర్షాలు కురుస్తాయంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లనికబురు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా వచ్చేవారం జోరువానలుంటాయని ప్రకటించారు.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇంకా వేసవి ఆరంభంలో ఉండగానే కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వెదర్ మ్యాన్ చల్లనికబురు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చేవారమంతా జోరుగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.
25
వచ్చే వారమంతా వర్షాలే..
మార్చి 16 నుండి తెలంగాణలో వర్షాలు మొదలవుతాయని... ఇవి మార్చి 23 వరకు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించారు. వడగళ్ల వానలు కూడా పడే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
35
రైతులు జాగ్రత్త...
ఎండాకాలంలో కురిసే అకాలవర్షాలు ప్రమాదకరమైనవి... ఇవి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈదురుగాలులు, వడగళ్ళ వానలకు అనేక పంటలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మామిడి రైతులు ఈ అకాలవర్షాల దెబ్బకి తీవ్రంగా నష్టపోతుంటారు. కాబట్టి ముందుగానే అన్నదాతలు పంటలు కాపాడుకునేందుకు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు.
ఇదిలావుంటే గత నాలుగైదు రోజులు తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ (మార్చి 10) వీటితీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఈస్ట్ తెలంగాణలో 36-37 డిగ్రీలు, హైదరాబాద్ లో 34-35, ఇతర రాష్ట్రాల్లో 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదరకంగా మారుతుందని తెలిపారు.
55
తెలంగాణ హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఇక్కడే..
నిన్న (మార్చి 9, సోమవారం) తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు మహబూబ్ నగర్ లో నమోదయ్యాయి... మధ్యాహ్నం సమయంలో ఏకంగా 39.4 డిగ్రీలతో భానుడి భగభగలు కొనసాగాయి. ఇక మెదక్ లో 38.8, ఆదిలాబాద్, నిజామాబాద్ లలో 37.8, భద్రాచలంలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా హకీంపేటలో 36.8 డిగ్రీలు నమోదయ్యాయి.