Cyclone Arnab Alert: సైక్లోన్ అర్నబ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలకు పెను ముప్పు.. ఆ తేదీల్లో భారీ వర్షాలు

Published : Oct 26, 2026, 07:47 AM IST

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను తీవ్రరూపం దాలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు, కుండపోత వర్షాలకు అవకాశం ఉండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

PREV
16
ఏపీ, తెలంగాణలకు రెడ్ అలర్ట్.. తుపాను తీరం దాటేది ఎప్పుడంటే?

బంగాళాఖాతంలో మళ్లీ సీన్ మారింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది రాబోయే గంటల్లో మరింత తీవ్రమై అర్నబ్ అనే భారీ తుపానుగా రూపం దాల్చబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాను ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

26
తీరం దాటేది ఎక్కడ? గాలుల వేగం ఎంతంటే?

వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సోమవారం (అక్టోబర్ 26న) తుపానుగా మారే అర్నబ్, 27 నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 28వ తేదీన విశాఖపట్నం - మచిలీపట్నం (ముఖ్యంగా కాకినాడ-నర్సాపురం మధ్య ఉన్న కోనసీమ ప్రాంతం) వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో సముద్ర తీరం వెంబడి గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు ఏకంగా 140 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

36
ఏపీకి రెడ్ అలర్ట్.. ఆ జిల్లాల బిగ్ అలర్ట్

తుపాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి సన్నద్ధతను ప్రకటించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, యానాం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ సగటున 22 నుంచి 29 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చని అంచనా. కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ, విశాఖ పోర్టుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

46
తెలంగాణలోనూ దంచికొట్టనున్న వర్షాలు

అర్నబ్ ప్రభావం కేవలం ఏపీకే పరిమితం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ మీదుగా వచ్చే తేమ గాలుల వల్ల తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగరి తదితర జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీలకు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు.

56
హైదరాబాద్‌ లో కూడా వానలు

హైదరాబాద్ నగరాన్ని కూడా అర్నబ్ వర్షాలు పలకరించనున్నాయి. చార్మినార్, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలుల వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, విద్యుత్ స్తంభాలు, ఓపెన్ డ్రైనేజీల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

66
సర్కార్ అలర్ట్.. మత్స్యకారులకు కీలక సూచనలు

తుపాను కారణంగా సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే వేటకు వెళ్లిన బోట్లను వెంటనే వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. ప్రతి 4 గంటలకొకసారి వాతావరణ బులెటిన్ విడుదల చేస్తూ పౌరుల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories