Hyderabad
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ సంసిద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అదిష్టానం మొత్తాన్ని హైదరాబాద్ లో దించి CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ అధినేత్రి సోనియా గాంధీతో హైదరాబాద్ శివారు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్దమయ్యింది. ఇలా అసెంబ్లీ ఎన్నకల ప్రచారం జోరు పెంచిన కాంగ్రెస్ కు వినూత్న పోస్టర్లతో షాక్ ఇచ్చారు. గతంలో సోనియా, రాహుల్ గాంధీలపై రేవంత్ చేసిన విమర్శలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వ పథకాలను పోలుస్తూ సిడబ్యూసీ మీటింగ్ జరుగుతున్న హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో వాల్ పోస్టర్లు వెలిసాయి.
Telangana Congress
తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంధీని బలిదేవత అని... పలు సందర్భాల్లో రాహుల్ గాంధీని పప్పు అని ఆనాడు టిడిపిలో వున్న రేవంత్ రెడ్డి విమర్శించాడని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ లో చేరి పిసిసి పదవి దక్కగానే బలిదేవత కాస్త మంచిదేవత అయ్యిందని... పప్పు కాస్త నిప్పు అయ్యాడని ఎద్దేవా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సిడబ్యూసి సమావేశాల వేళ ఏకంగా పోస్టర్లు ఏర్పాటుచేయడం కలకలం రేపుతోంది.
Hyderabad
బంజారాహిల్స్ తాజ్ కృష్ణా హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లోనే బలిదేవత అంటూ సోనియాగాంధీకి, ముద్దపప్పు అంటూ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్నట్లు పోస్టర్లు వెలిసాయి. కాంగ్రెస్ నాయకులు హోటల్ కు చేరుకునే మార్గంలో ఈ పోస్టర్లు ఏర్పాటుచేసారు.
Hyderabad
అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేస్తున్న సంక్షేమ పథకాల కంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు బేష్ అనేలా మరికొన్ని పోస్టర్లు ఏర్పాటుచేసారు. కరప్ట్ కాంగ్రెస్ మోడల్ వర్సెస్ కరెక్ట్ బిఆర్ఎస్ మోడల్ అంటూ వాల్ పోస్టర్లు వెలిసాయి. దళిత బంధు, ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల గురించి వివరిస్తూ ఇలాంటివి కాంగ్రెస్ పాలిత రాష్ట్రల్లో లేవని పోస్టర్లలో వివరించారు.
Hyderabad
ప్రస్తుతం తెలంగాణలో అధికారం కోసమే కాంగ్రెస్ హామీలు ఇస్తోందని... వీటిని అమలుచేసే చిత్తశుద్ది ఆ పార్టీకి లేదని బిఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పోస్టర్లలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు, ఇప్పటికే అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదంటూ పోస్టర్లు వున్నాయి.
Hyderabad
తెలంగాణలోని దళిత సమాజం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం 'దళిత బందు' ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో అసలు ఇలాంటి పథకమే లేదన్నారు. ఆ రాష్ట్రాలు దళితులకు అందిస్తున్న నిధులు సున్నా అంటూ పోస్టర్ ఏర్పాటుచేసారు.
Hyderabad
ఇక తెలంగాణలో వికలాంగులకు రూ.4116 పెన్షన్ ఇస్తుంటే చత్తీస్ ఘడ్ రూ.500, హిమాచల్ ప్రదేశ్ రూ.1300, కర్నాటక రూ.1100, రాజస్థాన్ రూ.1250 ఇస్తోందంటూ మరికొన్ని పోస్టర్లు వెలిసాయి. వృద్దులకు కూడా కాంగ్రెస్ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే అధిక పెన్షన్లు (రూ.2016) లభిస్తున్నాయని తెలిపారు.
Hyderabad
రైతులకు భీమా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది లేదంటూ పోస్టర్లు వెలిసాయి. కేసీఆర్ సర్కార్ రైతులకు రూ.5 లక్షల బీమా అందిస్తుంటే చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో సున్నా అంటూ ఎద్దేవా చేస్తూ పోస్టర్లు వెలిసాయి.
Hyderabad
రైతు బంధ కింద తెలంగాణ రైతులకు ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందంటూ మరికొన్ని పోస్టర్లు ఏర్పాటుచేసారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకమే లేదని పేర్కొన్నారు.
Hyderabad
తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ... చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ ఈ పని చేయడంలేదంటూ పోస్టర్లు ఏర్పాటుచేసారు.
Hyderabad
ఇలా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోస్టర్లు వెలిసాయి. అయితే ఈ పోస్టర్లపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమంటున్నారు. ఇది ముమ్మాటికీ బిఆర్ఎస్ పనేనని... రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుండటంతోనే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.