బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు: ఎంఐఎం ప్రభావంపై రాహుల్ ఆరా

First Published | Apr 17, 2023, 6:39 PM IST

బీఆర్ఎస్ తో  పొత్తు లేదని  రాహుల్ గాంధీ స్పష్టం  చేశారు. తెలంగాణ నేతలు  ఇవాళ  రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.  ఈ సమయంలో  తెలంగాణ   రాష్ట్ర రాజకీయాలపై  చర్చించారు. 

రాహుల్ గాంధీ

తెలంగాణలో బీఆర్ఎస్‌తో పోత్తు లేదని  కాంగ్రెస్ పార్టీ నేతలకు  ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చి  చెప్పారు. సోమవారంనాడు రాహుల్ గాంధీతో  తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.  కర్ణాటక  ఎన్నికల  ప్రచారంలో  పాల్గొని  ఢిల్లీకి తిరిగి వెళ్లే సమయంలో  శంషాబాద్  ఎయిర్ పోర్టు కు రాహుల్ గాంధీ  చేరుకున్నారు. 

రాహుల్ గాంధీ

 రాహుల్ గాంధీ శంషాబాద్  ఎయిర్ పోర్టుకు  వస్తున్న విషయాన్ని తెలుసుకున్న  కాంగ్రెస్ పార్టీ నేతలు  శంషాబాద్  ఎయిర్  పోర్టుకు  చేరుకున్నారు. 
శంషాబాద్  ఎయిర్  పోర్టులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు  రాహుల్ గాంధీతో  భేటీ అయ్యారు.  రాష్ట్ర రాజకీయాలపై  రాహుల్ గాంధీతో  అరగంటపాటు  కాంగ్రెస్  నేతలు  చర్చించారు. 

Latest Videos


రాహుల్ గాంధీ


బీఆర్ఎస్ తో  పొత్తు ఉండదని  రాహుల్ గాంధీ  పార్టీ నేతలకు  స్పష్టం  చేశారు. ఈ విషయాన్ని  ప్రజలకు  వివరించాలని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు  సూచించారు.బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉందనే అంశాన్ని  ప్రచారం  చేస్తూ  బీజేపీ  లబ్ది పొందే  ప్రయత్నం  చేస్తుందని  రాహుల్ గాంధీ  పార్టీ  నేతలకు  చెప్పారు. తెలంగాణలో  ఎంఐఎం  ప్రభావం  గురించి  రాహుల్ గాంధీ  పార్టీ నేతలతో  చర్చించారు. 

రాహుల్ గాంధీ

గత ఏడాది  న్యూఢిల్లీలో  పార్టీ నేతలతో  సమావేశమైన సమయంలో  కూడా  బీఆర్ఎస్ తో  పొత్తు ఉండదని  రాహుల్ గాంధీ  తేల్చి  చెప్పారు.  వరంగల్  సభలో కూడా ఈ విషయాన్ని  రాహుల్ గాంధీ  ప్రస్తావించారుఇటీవల  కాలంలో  బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై  ప్రచారం సాగుతున్న నేపథ్యంలో  రాహుల్ గాంధీ  పార్టీ నేతలకు  ఈ విషయమై  స్పష్టత  ఇచ్చారు. 

రాహుల్ గాంధీ

దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై  కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది  ఈ ఏడాది మే మాసంలో  కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఏడాది చివర్లో  తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరుగుతాయి.  ఈ రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వ్యూహకర్తగా  సునీల్ కనుగోలును  నియమించుకుంది.

రాహుల్ గాంధీ

తెలంగాణలో  అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.  తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ  బలోపేతం  కాకపోవడంపై ఆ పార్టీని  నిరాశకు గురి చేసింది.  ఈ  దఫా  పార్టీని  అధికారంలోకి తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  చెబుతున్నారు

click me!