షీ టీమ్స్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య.. యువతి ఇంటిముందు మృతదేహంలో నిరసన.. 24 గంటలు గడిచినా..

Published : Apr 17, 2023, 07:28 AM ISTUpdated : Apr 17, 2023, 07:29 AM IST

యువతిని వేధించిన కేసులో ఓ యువకుడిని షీ టీమ్స్ విచారించాయి. ఆ తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. షీ టీమ్స్ వేధింపుల వల్లే చనిపోయాడంటూ నిరసన చేస్తున్నారు. 

PREV
16
షీ టీమ్స్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య.. యువతి ఇంటిముందు మృతదేహంలో నిరసన.. 24 గంటలు గడిచినా..
Suicide

నల్గొండ : నల్గొండ జిల్లా చండూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా అతని మృతదేహంతో శనివారం సాయంత్రం నుంచి ప్రారంభించిన ఆందోళన ఆదివారం రాత్రి 24 గంటలు దాటిన కొనసాగుతూనే ఉంది. నల్గొండ జిల్లా చండూరు మండలం తాస్కాని గూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాస్కాని గూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు.. అదే గ్రామానికి చెందిన యువతిని వేధించాడనే ఫిర్యాదు పోలీసులకు అందింది. దీంతో ఈ కేసులో నిందితుడిగా అబ్బనబోయిన శివ (26) అనే యువకుడిని ఇటీవల పోలీసులు విచారించారు.

26

ఈ క్రమంలోనే శివ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అది గమనించిన వారు వెంటనే హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, యువకుడి కుటుంబసభ్యులు తీవ్ర అగ్రహావేశాలకు లోనయ్యారు. శివ మృతదేహంతో యువతి ఇంటికి  వెళ్లారు. వారి ఇంటి ముందు యువకుడి మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. ఆ యువకుడి మృతికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 24 గంటలు గడిచినా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. 

36

తమ డిమాండ్ నెరవేరేవరకు మృతదేహాన్ని తీసుకువెళ్లే ప్రసక్తేలేదని కుటుంబ సభ్యులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోయువతి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయారు. యువకుడి కుటుంబ సభ్యుల మృతదేహానికి సమీపంలో కూర్చుని ఆందోళన చేస్తున్నారు. 24 గంటలు గడవడంతో మృతదేహం నుంచి దుర్వాసన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

46

ఇదిలా ఉండగా, చండూరు మండల పరిధిలోని తస్కాని గూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

56

గ్రామానికి చెందిన యువతిని అబ్బనబోయిన శివ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. యువతి తల్లి షీ టీమ్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అతడిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంటికి చేరుకున్న శివ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానీ..పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కౌన్సెలింగ్ పేరుతో శివను కొట్టారని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

66

ఆ మనస్తాపంతో శివ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. పోలీసులు శివ మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. శివ కుటుంబ సభ్యులు మృతదేహంతో బాలిక ఇంటి ముందు నిరసనకు యత్నించారు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతుడి బంధువులు పోలీసులపై కారంపొడి చల్లి దాడి చేశారు. షీటీమ్ సీఐ రాజశేఖర్‌పై శివ సోదరి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

click me!

Recommended Stories