Telangana Inter Results 2025 : విడుదల తర్వాత మీ పిల్లల రిజల్ట్ ఇలా చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ గైడ్

Published : Apr 18, 2025, 03:50 PM ISTUpdated : Apr 18, 2025, 03:55 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటనకు సర్వం సిద్దమయ్యింది. రేపోమాపో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఫలితాలను ప్రకటించనుంది. మీ పిల్లలు కూడా ఇంటర్ పరీక్షలు రాసారా? అయితే ఫలితాల విడుదల తర్వాత ఇలా చెక్ చేయండి. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇక్కడ అందిస్తున్నాం.  

PREV
13
Telangana Inter Results 2025 : విడుదల తర్వాత  మీ పిల్లల రిజల్ట్ ఇలా చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ గైడ్
Telangana Inter Results 2025

Telangana Inter Results 2025 : విద్యార్థులు, పేరెంట్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన పూర్తయ్యింది... మార్కులను ఆన్ లైన్ లో నమోదు చేసారు. ఇలా ఫలితాల ప్రకటనకు ఇంటర్ బోర్డ్ సర్వం సిద్దం చేసింది... ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ముగించుకుని రాగానే ప్రకటన ఉంటుందని స్పష్టం చేసారు. 

ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఫలితాల ప్రకటనపై కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే స్పాట్ వాల్యూయేషన్ తో పాటు ర్యాండమ్ రీవాల్యూయేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిందని... ఏప్రిల్ 20 తర్వాత ఎప్పుడైనా ఫలితాల ప్రకటన ఉంటుందన్నారు. దీంతో ఇంటర్ విద్యార్థుల్లో టెన్షన్ మొదలయ్యింది. 

ఈసారి తెలంగాణవ్యాప్తంగా 9.96 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసారు. మార్చి 5 నుండి 24 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6 నుండి 25 వరకు సెంకడ్ ఇయర్ పరీక్షలు జరిగాయి. అయితే ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు జవాబు పత్రాలు మూల్యాంకనను ప్రారంభించారు. ఇలా మార్చి 18 నుండి రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో మూల్యాంకన చేపట్టారు. దీంతో పరీక్షలు ముగిసిన నెలలోనే ఫలితాల ప్రకటనకు ఇంటర్ బోర్డు సిద్దమయ్యింది. 
 

23
Telangana Inter Results 2025

ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? 

అతి త్వరలో ఇంటర్మీడియట్ ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండ్ ఇయర్ ఫలితాలను కూడా ఒకేసారి ప్రకటించనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత విద్యార్థులు ఆన్ లైన్ ఎలా చేసుకోవాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూద్దాం. 

స్టెప్ 1 :  మొదట ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గాని సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేయాలి. అందులో ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి. 

స్టెప్ 2 :  ఈ వెబ్ సైట్ హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2025 లేదా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. 

స్టెప్ 3 : విద్యార్థుల హాల్ టికెట్ నంబర్ తో పాటు అక్కడ అడిగిన ఇతర డిటెయిల్స్ పొందుపర్చి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తారు. దాన్ని ప్రింటవుట్ తీసుకోవాలి. 

results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను పొందవచ్చు.  ఇందులో కూడా పైన తెలిపిన స్టెప్స్ ను ఫాలో అయి ఫలితాలను తెలుసుకోవచ్చు. 
 

33
Andhra Pradesh Inter Results 2025

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల ప్రభంజనం : 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి.  అక్కడ మొత్తం 10.5 లక్షలమంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసారు... మార్చి 1 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా కేవలం   నెల రోజుల్లోపే మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలను వెల్లడించారు. అయితే ఈ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రికార్డులు బద్దలుగొట్టాయి. పదేళ్ల రికార్డును బద్దలుగొడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం 47 శాతం, రెండో సంవత్సరం 69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ జనరల్ ఫస్ట్ ఇయర్  లో 50314 మంది పరీక్ష రాస్తే 23799 మంది ఉత్తీర్ణత సాధించారు... అంటే ఉత్తీర్ణ శాతం 47. అదే సెకండ్ ఇయర్ లో 39783 మంది పరీక్ష రాస్తే 27276 మంది ఉత్తీర్ణులయ్యారు... అంటే ఉత్తీర్ణత శాతం 69. ఇందులో ఫస్ట్ ఇయర్ లో 39 శాతం అబ్బాయిలు, 55 శాతం అమ్మాయిలు పాసయ్యారు.  అదే సెకండ్ ఇయర్ లో 62 శాతం అబ్బాయిలు, 74 శాతం అమ్మాయిలు పాసయ్యారని స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ అన్నింటిని కలిపితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉత్తీర్ణత శాతం 70 కాగా సెకండ్ ఇయర్ లో అయితే ఏకంగా 83 శాతంగా ఉంది.  గత పదేళ్ల ఫలితాలను పరిశీలిస్తే ఈస్థాయిలో ఎప్పుడూ ఫలితాలు రాలేవని లోకేష్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories