ఈసారి కూడా లాంగ్ వీకెండ్... ఆ విద్యార్థులకు కూడా :
ఏప్రిల్ 18 అంటే రేపు గుడ్ ప్రైడే. క్రైస్తవులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు... ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు. తమ ఆరాధ్యదైవం యేసుక్రీస్తుకు శిలువపై ప్రాణాలు వదిలిన రోజును గుడ్ ప్రైడే గా జరుపుకుంటారు. ఈరోజును సంతాప దినంగా పాటించి ఉపవాస దీక్ష చేపడతారు. ఇలా గుడ్ ప్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు, ఉద్యోగులకు రేపు సెలవు ఉంది. తెలుగు రాష్ట్రాలు కూడా గుడ్ ప్రైడే సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించారు.
ఇక ఏప్రిల్ 19న శనివారం ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు సాధారణ సెలవు ఉంటుంది.అయితే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా ప్రతి శనివారం సెలవు ఉంటుంది. ఇక గతవారం రెండో శనివారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు... కానీ కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఆరోజు స్కూళ్లు నడిపి ఈ శనివారం సెలవు ఇచ్చారు. ముఖ్యంగా క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు గత శనివారం బదులు ఈ శనివారం సెలవు ఇచ్చాయి. ఇలా ఉద్యోగులకే కాదు చాలా విద్యాసంస్థలకు శనివారం సెలవు వస్తోంది.
ఏప్రిల్ 19 ఆదివారం... అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే ఉద్యోగులకు కూడా సెలవే. ఇలా ఈ శుక్ర, శని, ఆదివారం మూడ్రోజులు వరుస సెలవులు వస్తున్నాయి.
అయితే ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయి కాబట్టి శనివారం సెలవుపై పేరెంట్స్ విద్యాసంస్థలను సంప్రదించాలి. ప్రభుత్వ పాఠశాలలన్నీ ఏప్రిల్ 19న యధావిధిగా నడుస్తాయి... ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు మాత్రమే సెలవు ఉందో లేదో కనుక్కోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే శనివారం సెలవు ఇచ్చారు.