గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన టీఎస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ

Published : Nov 16, 2021, 12:48 PM IST

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్, అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను సిజే సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. 

PREV
17
గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన టీఎస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ
Satish Chandra Sharma

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఏజీ బిఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పృష్టికర్త ,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

27
Satish Chandra Sharma

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ,ఇతర న్యాయమూర్తులు ఏజీ బిఎస్ ప్రసాద్, అడిషనల్ ఏ జి జె.రామచందర్ రావు, కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు.

37
Satish Chandra Sharma

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను సిజే సతీష్ చంద్ర శర్మ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా తాను రైతు కుటుంబం నుండి వచ్చినట్టు గుర్తు చేసారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయని ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

47
Satish Chandra Sharma

హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జిజిఖానా ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణములో లో సిజే సతీష్ చంద్ర శర్మ ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

57
Satish Chandra Sharma

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా హైకోర్టు ప్రాంగణములో మొక్కలు నాటడం పట్ల న్యాయమూర్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ మొదటగా సిజే సతీష్ చంద్ర శర్మకి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క న్యాయమూర్తి కి వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు..

67
Satish Chandra Sharma

ఈ కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి,జస్టిస్ పి.నవీన్ రావు,జస్టిస్ జి.శ్రీదేవి,జస్టిస్ శ్రీ సుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నరసింహ రెడ్డి,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్ గౌడ్,బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ రావు,జీపీలు జోగినిపల్లి సాయి కృష్ణ,సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు ,స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్,ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..

77

MLC elections: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్.. ఎంపీ బండ ప్రకాష్‌కు టికెట్.. అందుకోసమేనా..?

Read more Photos on
click me!

Recommended Stories