కీసరగుట్ట దేవాలయ ప్రాంగణంలో జమ్మిమొక్కను నాటిన ఎంపీ సంతోష్

Arun Kumar P   | Asianet News
Published : Oct 12, 2021, 12:32 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరి ఊరికో జమ్మిచెట్టు - గుడి గుడికో జమ్మిచెట్టు కాార్యాక్రమానికి పిలుపునిచ్చిన ఎంపీ సంతోష్ కీసరగుట్ట దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.  

PREV
16
కీసరగుట్ట దేవాలయ ప్రాంగణంలో జమ్మిమొక్కను నాటిన ఎంపీ సంతోష్

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ''ఊరు ఊరికో జమ్మి చెట్టు‌ - గుడి గుడికో జమ్మి చెట్టు'' కార్యక్రమానికి టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ green india challange భాగంగా ఇవాళ హైదరాబాద్ శివారులోని ప్రముఖ దేవాలయం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో జమ్మి చెట్టును నాటారు మంత్రి మల్లారెడ్డితో కలిసి జమ్మిచెట్టు నాటారు ఎంపీ సంతోష్.  

26

హైదరాబాద్ నుండి నేరుగా కీసరకు చేరుకున్న ఎంపీ సంతోష్ మొదట రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో జమ్మిచెట్టు నాటి నీరు పోశారు ఎంపీ. 

36

అనంతరం తాను దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ లోనూ మొక్కలు నాటారు ఎంపీ సంతోష్.  కీసర ఫారెస్ట్ లోని పెద్ద చెరువు దగ్గర జమ్మి మొక్కలను మంత్రి మల్లారెడ్డి కలిసి నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

read more  సతీసమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ పైనే చర్చ?

46

ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సెలబ్రీలతో మొక్కలను నాటించి ప్రజల్లో చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్న ఎంపీ సంతోష్ ఇటీవల మరో ఊరు ఉరికో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మిచెట్టు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వార ప్రతి గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి చెట్టు నాటడం జరుగుతోంది. 

56

దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమని... ప్రతి ఒక్కరూ ఇదే విధంగా  గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని సంతోష్ పిలుపునిచ్చారు. దసరా సర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కను నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
 

66

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

click me!

Recommended Stories