కారణమిదీ: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రకియ మరింత ఆలస్యం

First Published Jun 15, 2021, 11:07 AM IST

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎంపికను  పార్టీ అధిష్టానం తాత్కాలికంగా పక్కన పెట్టింది.

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఈ వారంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగింది. అయితే ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
undefined
టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ చివరిదశకు వచ్చింది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుందని మాణికంఠాగూర్ ఇదివరకే ప్రకటించారు.
undefined
సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై నివేదికను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు. అయితే ఈ తరుణంలోనే రాష్ట్రానికి చెందిన సీనియర్లు పీసీసీ చీఫ్ ఎవరుండాలనే దానిపై పార్టీ నాయకత్వానికి లేఖలు సంధించారు.
undefined
రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఠాగూర్ ఉన్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో నెలకొంది. రేవంత్ రెడ్డికి కాకుండా ఇతరులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయమై కొందరు నేతలు రేవంత్ పై ఫిర్యాదులు కూడ చేస్తున్నారు.
undefined
మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చినవారికి పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వడం సరైంది కాదని వి. హనుమంతరావు అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.
undefined
గత వారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీ వెళ్లారు. పీసీసీ రేసులో ఉన్న నేతలంతా ఢిల్లీలో ఉండడంతో మరోసారి పీసీసీ పీఠంపై చర్చ ప్రారంభమైంది. వ్యక్తిగత పనుల నిమిత్తమై తాము ఢిల్లీకి వచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు
undefined
రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కేంద్రీకరించింది. రాజస్థాన్ కు చెందిన సచిన్ పైలెట్ ఢిల్లీలో మకాం వేశారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో రాజస్థాన్ వ్యవహరాలపై కాంగ్రెస్ నాయకత్వం కేంద్రీకరించింది.
undefined
పంజాబ్ రాష్ట్రంలో సీఎం అమరీందర్ సింగ్, మంత్రి సిద్దూల మధ్య కూడ విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే పార్టీ మనుగడకు ప్రమాదంగా నాయకత్వం భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలపై కేంద్రీకరించింది. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.
undefined
టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయానికి సంబంధించిన ఫిర్యాదులు అందండంతో ఈలోపుగా ఈ అంశాన్ని కూడ పరిశీలించాలని పార్టీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. దీంతో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
undefined
click me!