Published : Jun 15, 2021, 11:01 AM ISTUpdated : Jun 15, 2021, 11:03 AM IST
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం నాడు దర్శించుకొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్వీరమణ యాదాద్రిలో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి వచ్చారు. సతీసమేతంగా ఆలయానికి వచ్చిన సీజెఐకు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.