తెలంగాణ చరిత్రే కాదు వర్తమానం కూడా ఎంతో ఘనమైనది. ఈ రాష్ట్రం గురించి గొప్పగొప్ప విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి తెలంగాణకే సాధ్యమైన మైండ్ బ్లాంక్ అద్భుతాల గురించి తెలుసుకుందాం.
Facts about Telangana : తెలంగాణ... భారతదేశంలో అతి తక్కువ వయసుగల రాష్ట్రం. 2014లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన ఈ రాష్ట్రం గత పదకొండేళ్ళుగా స్వతంత్ర పాలన సాగిస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్న తెలంగాణ ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేసింది. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు సాధించింది.
తెలంగాణ ప్రాంతం చరిత్రలోనే ఓ వెలుగు వెలిగింది. ఆనాడే దేశంలోనే కాదు ప్రపంచస్థాయి ధనవంతులుగా నిజాంలు వెలుగొందారు. హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అత్యంత విలువైన జాకబ్ డైమండ్ ను పేపర్ వేయిట్ గా ఉపయోగించేవారని... ఇది ఆయన తండ్రి షూలో దొరికిందని చెబుతారు... ఇదిచాలదా నిజాంలు ఎంతటి శ్రీమంతులో చెప్పడానికి. ఇలా చరిత్రే కాదు తెలంగాణ వర్తమానం కూడా చాలా ఘనమైనది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్దిని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
అయితే తెలంగాణ ఘనచరిత్ర గురించి చాలామందికి తెలియదు. ఈ రాష్ట్రం ఎంతటి అద్భుతాలు సృష్టించిందో బయటి ప్రపంచానికి కాదు చాలామంది తెలుగు ప్రజలకే తెలియదు. కాబట్టి తెలంగాణ గొప్పతనాన్ని తెలిపే టాప్ 10 విశేషాలు గురించి తెలుసుకుందాం.
26
Ramoji Film City
1. ఆసియాలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో (Ramoji Film City) :
రామోజీ ఫిల్మ్ సిటీ... ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్డ్ స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. హైదరాబాద్ శివారులోని ఏకంగా 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫిల్మ్ సిటీ వుంది. ఇక్కడ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మళయాళి సినిమాల నిర్మాణం జరుగుతుంది. కొన్ని హాలీవుడ్ మూవీస్ చిత్రీకరణ కూడా ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. అంతేకాదు తెలుగు ప్రజలు, దేశ విదేశాల పర్యాటకులు ఈ ఫిల్మ్ సిటీని సందర్శిస్తుంటారు.
36
Prasads IMAX
2. దేశంలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ (Prasads Imax) :
హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ ప్రపంచస్థాయి గుర్తింపుపొందిన మల్టిప్లెక్స్ థియేటర్. ఇందులో 72 అడుగుల ఎత్తు, 95 అడుగుల వెడల్పు కలిగిన అతిపెద్ద స్క్రీన్ వుంది. దేశంలో ఇదే అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఐమాక్స్.ఇది 12,000 వాట్ సౌండ్ సిస్టంను కలిగివుంది... దీంట్లో సినిమా సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
46
electricity
3. తెలంగాణ ఉచిత కరెంట్ (Free Current) :
గతంలో తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చేవారు... కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ ను కూడా ఉచితంగా ఇస్తున్నారు. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారులు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అయితే దేశంలో మొదటిసారిగా వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఘనత ఉమ్మడి రాష్ట్రానిది.
56
drinking water
4. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు (Mission Bhagiratha) :
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తాగునీటిలో ప్లోరైడ్, మరికొన్ని జిల్లాల్లో తాగునీటి కొరత వుండేది. ఇది గమనించిన బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత సాగునీరు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఇలా మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి తాగునీరు అందించారు. ఇలా ఇంటింటికి తాగునీరు అందించిన మొదటిరాష్ట్రం తెలంగాణ.
66
Buddha Statue of Hyderabad
5. గౌతమబుద్దిని మోనోలిథిక్ (ఏకశిల) విగ్రహం :
హైదరాబాద్ అందాలను రెట్టింపుచేసేలా హుస్సేన్ సాగర్ జలాశయం మధ్యలో ఠీవిగా నిలుచున్న గౌతమబుద్దుడి విగ్రహం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ విగ్రహం కేవలం ఒకే ఒక్క రాతితో చెక్కినది... అంటే మోనోలిథిక్ లేదా ఏకశిల విగ్రహం అన్నమాట. ఈ విగ్రహం 58 అడుగుల (18 మీ) ఎత్తు, 350 టన్నుల బరువు కలిగి ఉంది. ఇలాంటి విగ్రహాలు చాలా అరుదు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన బుద్ధుని ఏకశిలా విగ్రహంగా గుర్తింపుపొందింది.