టెట్‌ రాసిన వారికి అలర్ట్‌, కీ విడుదలకు రంగం సిద్ధం.. ఎలా చెక్‌ చేసుకోవాలి. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్

Published : Jan 24, 2025, 01:40 PM IST

TG TET: తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) పరీక్ష ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన పరీక్షలు జనవరి 20 తేదీతో ముగిశాయి. కాగా టెట్‌ పరీక్ష పూర్తయిన నేపథ్యంలో ప్రాథమిక కీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ టెట్‌ కీని ఎలా చెక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
టెట్‌ రాసిన వారికి అలర్ట్‌, కీ విడుదలకు రంగం సిద్ధం.. ఎలా చెక్‌ చేసుకోవాలి. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు డీఎస్‌సీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఒకసారి టెట్‌ పరీక్షను చేపట్టారు. అయితే మరోసారి డీఎస్సీ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరోసారి టెట్‌ పరీక్షను నిర్వహించారు. విడతల వారీగా జరిగిన టెట్‌ పరీక్షలు జనవరి 2వ తేదీన మొదలై 20వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. మొత్తం 10 రోజులపాటు పేపర్ 1, 2 పరీక్షలు జరితాయి. 

 

24

రెండు పేపర్లకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,05,278 హాజరయ్యారు. మొత్తం 74.44 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం టెట్‌ కీ కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో అధికారులు జనవరి 24వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఈ కీ పేపర్‌ను విడుదల చేయనున్నారు. 
 

34

పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేపర్‌ 1, పేపర్‌ 1 కీ పేపర్‌లను పీడీఎఫ్‌ ఫార్మట్‌లో విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు జనవరి 27వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. టెట్‌ ఎగ్జామ్‌ను 150 ప్రశ్నలకు నిర్వహించిన విషయం తెలిసిందే.

తప్పుడు సమాధానాలకు ఎలాంటి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉండదు. టెట్‌ పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ లెక్కన 90 మార్కులు రావాలన్నటమా. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌ వర్గాలకు చెందిన వారికి 5 శాతం సడలింపు ఉంటుంది. 
 

44

TS TET 2025 ఆన్సర్‌ కీ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.? 

తెలంగాణ టెట్‌ ఆన్సర్‌ కీ పీడీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ ఫాలో అయితే కీ పేపర్‌ను పొందొచ్చు. 

స్టెప్‌ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

స్టెప్‌2: అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే 'టీఎస్‌ టెట్‌ కీ పేపర్‌' లింక్‌ పై క్లిక్‌ చేయండి. 

స్టెప్ 3: పేపర్‌1 లేదా పేపర్‌ (గణితం & సైన్స్ లేదా సోషల్ స్టడీస్) కోసం సంబంధిత ఆన్సర్ కీ PDFపై క్లిక్ చేయాలి. 

స్టెప్‌ 4: వెంటనే పీడీఎఫ్‌ ఫైల్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. 

రిజల్ట్స్‌ ఎప్పుడంటే.. 

ఇదిలా ఉంటే టెట్‌ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కీ పేపర్‌కు సంబంధించి స్వీకరించిన తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫైనల్‌ కీ, ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫలితాలు విడుదల తర్వాత టీజీ టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories