ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 22,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లకు కొందరు ఎంపికయ్యారు. ఈ జాబితాను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఇంతకీ ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 2: అనంతరం అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 3: ఇందులో మొబైల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు.
స్టెప్ 4: వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. వెంటనే మీరు పథకానికి ఎంపికయ్యారో లేదో తెలుస్తుంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు.?
* ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణకు చెందిన వారై ఉండాలి.
* దరఖాస్తుదారులు ఆర్థికంగా వెనుకబడి ఉండాలి.