Hyderabad Weather : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్

Published : Apr 29, 2026, 10:45 AM IST

IMD Rain Alert : తెలంగాణలో ఓవైపు భానుడి భగభగలు పెరుగుతుండగా… మరోవైపు వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇకపై వెదర్ ఎలా ఉండనుందంటే..

PREV
15
తెలంగాణ వెదర్ అప్డేట్..

IMD Rain Aler : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి... ఇంకా మే నెలలోకి ఎంటర్ కానేలేదు అప్పుడే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. అయితే ఈ ఎండలు, వడగాలులు, ఉక్కపోత నుండి ఉపశమనం కలిగించేలా సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మండుటెండలు కాస్తున్నాయి... సాయంత్రం కాగానే ఒక్కసారిగా ఈదురుగాలులు మొదలై వర్షాలు కురుస్తున్నాయి.

25
నేడు హైదరాబాద్ వాతావరణం...

ఇవాళ (ఏప్రిల్ 29, బుధవారం) హైదరాబాద్ లో ఎండావాన పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం సమయంలో గరిష్ఠంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయట... కాబట్టి ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించింది.

ఇక సాయంత్రం కాగానే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది... వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాయంత్రం, రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

35
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్...

తెలంగాణలో ఓవైపు ఎండలు ముదురుతుండగా మరోవైపు వర్షాలు కూడా జోరందుకుంటున్నాయి. ఇలా ఇవాళ కూడా అత్యధికంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుండగా... జోరు వానలు కూడా కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్న ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.

45
తెలంగాణ వెదర్ మ్యాన్ వాతావరణ సమాచారం...

తెలంగాణలో ఇప్పటికే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.. నల్గొండ, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ వర్షాలు మరికొన్నిరోజులు కొనసాగుతాయని.. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక మే 4 నుండి ఈస్ట్, సెంట్రల్ తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన జోరువానలు కురుస్తాయని...అక్కడక్కడా వడగళ్ల వానలు ఉంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఎండల తీవ్రత కాస్త తగ్గుతుందని చల్లని కబురు అందించారు.

55
అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 మండలాలివే..

నిన్న (ఏప్రిల్ 28, మంగళవారం) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 మండలాలేవో తెలుసుకుందాం.

వికారాబాద్ జిల్లా పూడూరులో అత్యధికంగా 32.9 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఇక ఇదే జిల్లాలోని దౌల్తాబాద్ లో 16.3 మి.మీ, కొడంగల్ లో 6.6 మి.మీ, వికారాబాద్ పట్టణంలో 4.9 మి.మీ వర్షం నమోదయ్యింది. నారాయణపేట జిల్లా దామరగిద్దలో 11.1 మి.మీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో 11.0, శంకర్ పల్లిలో 10.8, మొయినాబాద్ లో 7.4, చేవెళ్ళలో 5.8, ఇబ్రహీంపట్నంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలివే..

నిన్న (ఏప్రిల్ 28, మంగళవారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ లో 45.3 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. నిజామాబాద్ లో 44.7, రామగుండంలో 43.2, మహబూబ్ నగర్ లో 42, మెదక్ లో 41.8, ఖమ్మంలో 41.8 ఉష్ణోగ్రతలున్నాయి. రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే హకీంపేటలో 41.6, దుండిగల్ లో 41.4, బేగంపేటలో 41.4 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. మొత్తంగా తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories