Telangana Holidays : దేశంలో మరెక్కడా ఉండవు.. తెలంగాణోళ్ళకు మాత్రమే వచ్చే ప్రత్యేక సెలవులేవో తెలుసా?

Published : Aug 30, 2025, 03:07 PM IST

సాధారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో సెలవులు సేమ్ ఉంటాయి. కానీ ఓ మూడు సెలవులు మాాత్రం తెలంగాణోళ్లకు ఎక్స్ట్రా గా వస్తాయి. ఆ సెలవులేంటి? తెలంగాణలోనే ఎందుకు? అనేది ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
తెలంగాణోళ్లకు మాత్రమే వచ్చే సెలవులివే..

Holidays : తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన సంస్కృతులు, సాంప్రదాయాలు కనిపిస్తాయి... ఇవి పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు మరెక్కడా కనిపించవు. ఇలా తెలంగాణకే పరిమితమైన పండగలు బోనాలు, బతుకమ్మ... ఈ రెండూ అమ్మవార్లను కొలిచే పండగలే. అయితే ఇప్పటికే బోనాల పండగ ముగియగా వచ్చేనెల సెప్టెంబర్ లో బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ బతుకమ్మ పండగ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఉంటుంది.

25
బతుకమ్మ సెలవు ఎప్పుడు?

ఈసారి సెప్టెంబర్ 21న బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అంటే విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఈరోజు నుండి తెలంగాణ మహిళలు వరుసగా తొమ్మిదిరోజులు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు... చివరగా సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి. ఇలా బతుకమ్మ వేడుకలు కేవలం తెలంగాణకు పరిమితం... కాబట్టి ఈ పండక్కి ఇక్కడమాత్రమే సెలవు ఉంటుంది. పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశంలో మరెక్కడా బతుకమ్మ సెలవు ఉండదు.

35
తెలంగాణ ఉద్యోగులకు ఓ సెలవు మిస్

అయితే ఈ సెప్టెంబర్ 21 ఆదివారం వస్తోంది... కాబట్టి తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు ఓ సెలవు మిస్ అవుతున్నారు. ఈరోజు బతుకమ్మ పండక్కి ప్రత్యేక సెలవు ఇవ్వకున్నా ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉండేది. ఓ సెలవు ఇలా మిస్ అవడం ఉద్యోగులను కాస్త బాధిస్తుంది... కానీ స్కూల్ విద్యార్థులకు ఈరోజు నుండే దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి... కాబట్టి వారు సెలవు మిస్సయ్యిందని చింతించే అవకాశం లేదు.

45
బోనాల పండగ సెలవు

బతుకమ్మ మాదిరిగానే బోనాల పండక్కి కూడా తెలంగాణవ్యాప్తంగా సెలవు ఉంటుంది. ఈ సెలవు కూడా కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం... దేశంలో మరెక్కడా ఉండదు. ఆషాడమాసంలో తెలంగాణ ఆడపడుచులు అమ్మవార్లకు కుండలో నైవేధ్యం సమర్పించడమే ఈ బోనాల పండగ స్పెషల్. హైదరాబాద్ లో అయితే ఆషాడమాసం మొత్తం బోనాల వేడుకలు జరుగుతాయి... ఇందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు చాలా ప్రత్యేకం.

55
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సెలవు

ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా కూడా సెలవు ఉంటుంది. ఈ సెలవు కూడా కేవలం తెలంగాణ ప్రజలకే వర్తిస్తుంది. ఇలా తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే ఏడాదిలో మూడ్రోజులు ప్రత్యేక సెలవులు వస్తాయి... అవి తెలంగాణ ఆవిర్భావం, బోనాలు, బతుకమ్మ... మొదటి రెండు సెలవులు ఇప్పటికే వచ్చేశాయి... ఇక బతుకమ్మ వేడుకల ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 21 సెలవు వస్తోంది. తెలంగాణ విద్యార్థులకు ఈరోజు నుండి అక్టోబర్ 3 వరకు అంటే వరుసగా 13 రోజులు దసరా సెలవులే.

Read more Photos on
click me!

Recommended Stories