School Holidays : తెలంగాణపైనా మురసు తుపాను అటాక్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూళ్లకి సెలవులు

Published : Nov 02, 2026, 03:52 PM IST

అర్నబ్ తుపానును మర్చిపోకముందే మురసు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. కొత్త తుపాను ఇవాళ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరందాటే అవకాశాలున్నాయట. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీలోనే కాదు తెలంగాణలోనూ స్కూళ్లకి సెలవులు వస్తున్నాయి.

PREV
14
ముంచుకొస్తున్న మురసు తుపాను ముప్పు

School Holidays : ఎల్ నినో కారణంగా ఈ వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురవలేదు.. కానీ ఇప్పుడు వరుస తుపానుల ప్రభావంతో జోరువానలు పడుతున్నాయి. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఏ స్థాయిలో బీభత్సం సృష్టించిందో చూశాం... ఇది తీరందాటే సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలం చేసింది. దీని నుండి ఇంకా తేరుకోకముందే ఇదే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. అదికాస్త బలపడి మురసు తుపానుగా రూపాంతరం చెందింది. ఇది కూడా ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువస్తోంది.

ప్రస్తుతం మురసు తుపాను నెల్లూరుకు 120 కి.మీ, కావలికు 140 కి.మీ, తిరుపతి 170 కి.మీ, ఒంగోలుకు 180 కి.మీ, బాపట్లకు 200 కి. మీ దూరంలో కేంద్రీకృతం అయివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుపాను ఇవాళ (నవంబర్ 2, సోమవారం) రాత్రి లేదా రేపు (నవంబర్ 3, మంగళవారం) తెల్లవారుజామున నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది.

ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... దీంతో కొన్నిజిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అయితే తెలంగాణపైనా మురుసు తుపాను విరుచుకుపడనుందని... బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. దీంతో తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు.

24
ఈ తెలంగాణ జిల్లాల్లో స్కూళ్లకి సెలవు?

మురసు తుపాను ప్రభావంతో నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ (నవంబర్ 2న) కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ... ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని స్కూళ్లు, అంగన్వాడీలకు మధ్యాహ్నం నుండి సెలవు ప్రకటించారు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మిగతా జిల్లాల్లోనూ పరిస్థితిని బట్టి కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు సెలవుపై నిర్ణయం తీసుకుంటున్నారు.

తుపాను తీరం దాటకముందే పరిస్థితి ఇలా ఉంది... తీరం దాటాక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ రాత్రి నుండి తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపు (నవంబర్ 3, మంగళవారం) నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తుపాను ప్రభావంతో భారీ వర్షాలే కాదు బలమైన ఈదురుగాలులు (గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో) వీస్తాయంటూ వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో ప్రమాదకరమైన వర్షాలు కురిసే అవకాశాలున్న ఈ జిల్లాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే నవంబర్ 3న సెలవు ఇవ్వాలా, వద్దా అన్నది ఆయా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు నిర్ణయించనున్నారు.. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం సెలవులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

34
ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు

మురసు తుపాను ప్రభావం ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లోనూ భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది... ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ జిల్లాల అధికారులు, ప్రజలు నవంబర్ 3న అప్రమత్తంగా ఉండాలన్నమాట.

ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది... ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

44
ఈ తెలంగాణ జిల్లాల్లో 100-130 సెం.మీ వర్షపాతం

సైక్లోన్ మురసు ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా నవంబర్ 3, 4, 5 తేదీల్లో అంటే మంగళ, బుధ, గురువారం మూడ్రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నవంబర్ 3 మధ్యాహ్నం నుండి నవంబర్ 4 రాత్రి వరకు కుండపోత వర్షాలుంటాయని అంటున్నారు… నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 100 నుండి 130 మిల్లిమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వెదన్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలపైనా మురసు తుపాను ప్రభావం ఉంటుందని... మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నవంబర్ 2 లేదా 3 తేదీల్లో తుపాను తీరందాటనున్న నేపథ్యంలో రేపు (మంగళవారం) అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు... ఉష్ఱోగ్రతలు కూడా పడిపోయి చలి పెరుగుతుందని తెలిపారు. ఇలా మురసు తుపాను ప్రభావం తెలంగాణపైనా గట్టిగానే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories