చలికాలంలోనూ ఎండల తీవ్రత.. రెడ్ జోన్ లో 10 జిల్లాలు
సాధారణంగా నవంబర్, డిసెంబర్ అనగానే చలి పుంజుకోవాలి. కానీ ఈసారి వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉండనుందని ఐఎండీ నవంబర్ అవుట్‌లుక్ వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణ సహా దక్షిణాదిలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర, మధ్య తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలను రెడ్ జోన్లో చేర్చారు. ఈ ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో రాత్రుళ్లు కూడా వేడిగానే ఉంటాయని, చలి జాడ పెద్దగా ఉండదని స్పష్టం చేశారు.