
Heavy Rains : అర్నబ్ తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి బీభత్సం సృష్టించిందో చూశాం. ప్రచండమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ఊహకందని ఆస్తినష్టాన్ని సృష్టించాయి... ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ ప్రకృతి విపత్తును ప్రజలు ఇంకా మరిచిపోకముందే మరో విపత్తు లోడ్ అవుతోంది. బంగాళాఖాతంలో కొత్త తుపాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని… ఇదికూడా ఏపీ తీరంవైపే దూసుకురానుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈసారి కేవలం ఏపీపైనే కాకుండా తెలంగాణపైనా ఈ తుపాను ప్రభావం ఉంటుందట... కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు తప్పవంటూ వాతావరణ హెచ్చరికలు వెలువడతున్నాయి.
అర్నబ్ తుపాను ఇలా తీరాన్ని తాకగానే మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది బలపడి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండం మారిందని వెల్లడించింది. ఇది రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందట.. రేపు అంటే ఆదివారం (నవంబర్ 1) సాయంత్రానికి తుపానుగా మారి తీరంవైపు దూసుకొస్తుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరిస్తోంది. సోమవారం (నవంబర్ 2) సాయంత్రానికి ఈ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందంటోంది. అయితే ఈ తుపాను ఎక్కడ తీరం దాటుతుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ తుపానుకు ఇండియా ప్రతిపాదించిన మురసు పేరును పెట్టనున్నారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలున్నాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని... భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని... కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.
మురసు తుపాను ప్రభావం కేవలం ఆంధ్ర ప్రదేశ్ పైనే కాదు తెలంగాణపైనా గట్టిగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది.
అయితే నవంబర్ 2 అంటే వచ్చే సోమవారం నుండి మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయట. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది... ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
0900 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान, शाम, 1730 बजे IST पर जारी किया गया/7-day forecast, EVENING, of TELANGANA based on 0900 UTC issued at 1730 hours IST Dated : 31/10/2026 https://t.co/7CXcGaYcb6
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) October 31, 2026
మురసు సైక్లోన్ ప్రభావంతో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 30 నుండి నవంబర్ 4 వరకు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు... అంటే ఈ 6-7 రోజులు జోరువానలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా నవంబర్ 2 నుండి 4 వరకు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు తెలంగాణ వెదర్ మ్యాన్.
భారీ వర్షాలతో వరదలు సంభవించవచ్చు.. వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశాలుంటాయి… నదులు, వాగులువంకల్లో వరదనీరు చేరి ప్రమాదకరంగా ప్రవహించవచ్చు… జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారవచ్చు… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనుంది.
THUNDERSTORMS + SYSTEM RAINS in Telangana during October 30 - November 4 🌧️
After LONG TIME, finally we gonna witness ACTIVE RAINS in Telangana for next 6-7 days
Especially RED MARKED DISTRICTS to get MODERATE - HEAVY RAINS on November 2-4 due to the impact of DEPRESSION (OR CYCLONE) moving towards Ongole - Machilipatnam coasts on November 2/3 ⚠️🌧️🌀
While rest of Telangana including Hyderabad City to get LIGHT - MODERATE RAINS during next 5-6days
Plan accordingly dear people 🌧️👍
— Telangana Weatherman (@balaji25_t) October 30, 2026