ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ :
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... నిన్న హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో ఐద్రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని 16 జిల్లాల్లో వర్షసూచనలు కనిపిస్తున్నాయని ప్రకటించారు... రెండ్రోజులపాటు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.
ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం ఎండలు మండిపోతాయి. ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.