ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో కేవలం భద్రతకే పరిమితం కాకుండా వినూత్న సేవలను అందిస్తూ ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తోంది ఆర్టీసీ. . ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఒకప్పుడు కేవలం ప్రభుత్వం నడిపే ఆర్టీసీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ రాకతో ఆర్టీసీ కొంత దెబ్బ పడిందని చెప్పాలి. అధునాతన సేవలు అందిస్తూ ప్రయాణికులను ఆకర్షించడంతో చాలా మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.
అయితే ఇటీవల ఇందులో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలు సైతం ప్రైవేట్ ట్రావెల్స్‌కు ధీటుగా అధునాతన సేవలను అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ ఆర్టీసీ ముందు వరుసలో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
25
బస్సుల్లో వైఫై సేవలు
తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే లహరి వంటి ఏసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు ఎంచక్కా జర్నీ చేస్తున్న సమయంలో ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇకపై ఈ సేవలను ఇతర బస్సుల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బస్సుల్లోనే కాకుండా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉచిత వైఫై సేవలను అందించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు
కేవలం గరుడా, లహరి వంటి బస్సులకే పరిమితమైన వైఫై సేవలను ఇతర బస్సుల్లోనూ తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో తొలుత ఈ సేవలను తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచనలో ఉంది.
35
కంటెంట్ ఆధారిత వైఫై సేవలు
అయితే కేవలం ఈ వైఫై సేవలు కేవలం ఇంటర్నెట్ యాక్సెస్‌కి పరిమితం కాకుండా.. ప్రయాణికుల కోసం కొన్ని చిత్రాలు, పాటలు వంటి కంటెంట్‌ని అప్‌లోడ్ చేసి, వాటిని WiFi ద్వారా మొబైల్ ఫోన్‌లలో చూపించనున్నారు. ఇందులో మధ్య మధ్యలో కమర్షియల్ యాడ్స్ ఉంటాయి. దీంతో ఆ ప్రైవేట్ సంస్థకు ఆదాయం లభిస్తుంది, RTCకి అదనంగా ఖర్చు లేకుండా సేవలందించే వీలు కలుగుతుంది.
ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ఈ వైఫై ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి ఆ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇందులో బస్సులు, బస్టాండ్లు, ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాల్లో ఉచిత వైఫై సదుపాయం ఎలా అమలవుతుందనే వివరాలు ఉన్నాయి.
55
ఆర్టీసీకి లాభం
వైఫై సదుపాయం వల్ల ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఇక ఆర్టీసీ కూడా ఈ విధానం కాసులు కురిపించనుంది. దీనికి అయ్యే ఖర్చును మొత్తం ప్రైవేట్ సంస్థలే భరిస్తాయి కాబట్టి ఆర్టీసీ పెద్దగా ఖర్చు ఉండదు. అలాగే ప్రైవేట్ సంస్థలకు కూడా యాడ్స్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఈ సరికొత్త ఆలోచన విజయవంతంమైతే ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.