Gallantry Award : తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డికి దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన శౌర్య పతకం లభించింది. వెంకట్ రెడ్డికి ఈ పురస్కారానికి ఎందుకు ఎంపికయ్యాడో తెలుసా?
Gallantry Award : పోలీసులంటే ప్రస్తుతం సమాజంలో ఓ తప్పుడు భావన ఏర్పడింది. లంచాలు తీసుకుంటారు, అమాయకులను కేసుల్లో ఇరికిస్తారు, డబ్బున్నవారికే న్యాయం చేస్తారు అని.. కేవలం కొందరు పోలీసుల వల్ల ఆ వ్యవస్థతే ఇలా కలంకం వస్తోంది. కానీ నిజాయితీతో పనిచేసే పోలీసులు చాలామంది ఉన్నారు... విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయనివారు కూడా ఉన్నారు. ఇలాంటి పోలీసులకు నిలువెత్తు నిదర్శనమే మన తెలుగు పోలీస్ మర్రి వెంకట్ రెడ్డి.
25
హెడ్ కానిస్టేబుల్ కు గ్యాలంటరీ అవార్డు..
రిపబ్లిక్ డే సందర్భంగా విధి నిర్వహణలో ధైర్యసాహసాలు ప్రదర్శించినవారికి కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 982 మందికి అవార్డులు ప్రకటించారు... ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డికి అత్యున్నత గ్యాలంటరీ అవార్డు (శౌర్య పతకం) కు ఎంపికయ్యారు.
35
ఎవరీ వెంకట్ రెడ్డి..?
మర్రి వెకంట్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉన్నారు... ప్రస్తుతం శేరిలింగంపల్లి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు వెంకట్ రెడ్డి.
అయితే గతేడాది వెంకట్ రెడ్డి విధి నిర్వహణలో ఊహించనివిధంగా ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఓ కరుడుగట్టిన నేరస్థుడు తనపై కాల్పులు జరిపినా ఏమాత్రం భయపడలేదు…అస్సలు వెనక్కి తగ్గలేదు. నేరస్తుడిని పట్టుకుని కటకటాల్లో తోసేవరకు వదల్లేదు... ఈ ధైర్యాన్ని మెచ్చుకునే రిపబ్లిక్ డే సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ కి గ్యాలంటరీ అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
చిత్తూరు జిల్లా సోమల మండలం వడ్డిపల్లె అనే మారుమూల గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. జల్సాలకు అలవాటుపడిన అతడు దొంగతనాలకు పాల్పడేవాడు... ఈ క్రమంలో 2022 లో పోలీసులకు పట్టుబడినా విశాఖ సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్నాడు. అక్కడినుండి హైదరాబాద్ కు మకాం మార్చిన ప్రభాకర్ ఇక్కడ దొంగతనాలు ప్రారంభించాడు.
అయితే గతేడాది ప్రభాకర్ నగరంలోని 'ప్రిజం పబ్' లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి మరో ఇద్దరు షహచరులతో కలిసి ఆ పబ్ కి వెళ్లాడు... నిందితుడికి లొంగిపోవాలని ఆదేశించారు. వీరినుండి తప్పించుకునేందుకు ప్రభాకర్ తనవద్ద ఉన్న గన్ తో కాల్పులు జరిపాడు... ఈ క్రమంలోనే వెంకట్ రెడ్డి కాలిలోంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ నొప్పిని భరిస్తూనే… రక్తం కారుతున్న కాలితోనే ముందుకు దూకి ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నాడు... నిందితుడికి జైలుకు పంపించాకే వెంకట్ రెడ్డి హాస్పిటల్ కు వెళ్లాడు.
ఇలా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నేరస్తుడిని పట్టుకున్న ప్రభాకర్ కి పోలీస్ ఉన్నతాధికారులే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అతడి ధైర్యసాహసం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసింది. కానీ ఇప్పుడు గ్యాలరంటీ అవార్డు ద్వారా వెంకట్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా తెలిసింది.
55
విశిష్ట పతకాలకు ఎంపికైన తెలంగాణ పోలీసులు వీళ్లే...
శౌర్య పతకం (గ్యాలంట్రీ అవార్డు) - మర్రి వెంకట్ రెడ్డి
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు - జీఎస్ ప్రకాశ్ రావు, అన్ను దామోదర్ రెడ్డి