Telangana: నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. మీకు కార్డు వ‌చ్చిందో, లేదో ఇలా చెక్ చేసుకోండి

Published : Jul 14, 2025, 10:44 AM ISTUpdated : Jul 14, 2025, 12:52 PM IST

10 ఏళ్ల త‌ర్వాత తెలంగాణలో కొత్త రేష‌న్ కార్డుల జారీకి ముంద‌డుగు ప‌డింది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు రేష‌న్ కార్డుల ప్ర‌క్రియ‌ను ప్రారంభించింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తికాగా కొత్త రేష‌న్ కార్డులు మంజూర‌య్యాయి. 

PREV
15
కొత్త రేషన్ కార్డుల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు ప్రారంభించింది. ఈ చర్యలతో పలు జిల్లాల్లో మళ్లీ కొత్త కార్డుల పంపిణీకి వేదిక సిద్ధమైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సూర్య‌పేట జిల్లా తుంగతుర్తి మండలంలోని తిరుమలగిరిలో రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడుతున్నారు. 

25
కొత్తగా జారీ అయ్యే కార్డుల సంఖ్య ఎంతంటే.?

ఇప్పటివరకు రాష్ట్రంలో 89.95 లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ, గత కొంత కాలంగా అనేక మంది అర్హులు కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కొత్తగా 3.58 లక్షల కార్డులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఇప్పటికే జనవరి 26 నుంచి మే 23వ తేదీ వరకూ 2.03 లక్షల కార్డులు మంజూరు కాగా, తాజా కేటాయింపుతో మొత్తం 5.61 లక్షల కొత్త కార్డులు ప్రజలకు లభించనున్నాయి. దీని ద్వారా 11 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరనుంది.

35
మీకు కార్డు సాంక్ష‌న్ అయ్యిందా లేదా.?

కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి తమ రేషన్ కార్డు స్థితిని ఆన్‌లైన్‌లో పరిశీలించుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* ఆ త‌ర్వాత FSC Search → Ration Card Search → FSC Application Search అనే ఆప్షన్‌ ఎంచుకుని → మీ సేవా నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి Search చేయాలి.

* మీ అప్లికేష‌న్ స్టేట‌స్ "Approved" అని ఉంటే, మీకు కార్డు మంజూరై పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అర్థం.

* "Pending" అని వస్తే, ఇంకా పరిశీలనలో ఉన్న‌ట్లు అర్థం చేసుకోవాలి.

45
పాత కార్డుల్లో స‌భ్యుల చేరిక

రేష‌న్ కార్డు అప్‌డేష‌న్‌లో భాగంగా పాత కార్డుల్లో 4.41 లక్షల మందిని కొత్తగా చేర్చనున్నారు. దీంతో మొత్తం 15.53 లక్షల మందికి ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధి కలుగనుంది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150 కోట్లు వరకు అదనపు భారం పడుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.

55
జిల్లాల వారీగా కార్డుల పంపిణీ

నల్గొండ జిల్లాకి 50,102 కొత్త కార్డులు లభించనున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌ జిల్లాలో 31,772, హైదరాబాద్‌లో మొత్తం 6.67 లక్షల కార్డులు ల‌భించ‌నున్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా 96,982 కార్డులు ల‌భించ‌నున్నాయి. పదేళ్ల విరామం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కొత్త రేష‌న్ కార్డులు ల‌భిస్తుండ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories