Telangana: రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఏకంగా ఆరుగురు ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లను మార్చుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేసింది. ఒకేసారి ఆరుగురు ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లను మార్చుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నిర్ణయం తర్వాత రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
25
హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మార్చారు. ఈ మార్పుతో నగర పోలీస్ వ్యవస్థలో కీలక నాయకత్వం కొత్త రూపు దాల్చింది.
35
డీజీ స్థాయి బదిలీలు
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా శిఖా గోయల్‌కు పదవి లభించింది. ఆమెకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్‌కుమార్ నియమితులయ్యారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల్లో అదనపు డీజీగా అనిల్ కుమార్‌ను నియమించారు. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక విభాగం డీజీగా విక్రమ్ సింగ్ మాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇతర ముఖ్య నియామకాలు
పౌరసరఫరాల విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు. మల్టీజోన్–2 ఐజీగా డీఎస్ చౌహన్ నియమితులయ్యారు. హైదరాబాద్ నగరంలో పలు కీలక స్థానాల్లో కూడా మార్పులు జరిగాయి. అదనపు సీపీ (క్రైమ్)గా శ్రీనివాసులు, జాయింట్ సీపీ (లా అండ్ ఆర్డర్)గా తఫ్సీర్ ఇక్బాల్ బాధ్యతలు చేపట్టనున్నారు. మాదాపూర్ డీసీపీగా రితు రాజ్, వెస్ట్‌జోన్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్ నియమితులయ్యారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝాపై ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని తప్పించారు. ఆయనను స్పెషల్ సెక్రటరీగా నియమించి, ఆ స్థానంలో హరితను కొత్త కలెక్టర్‌గా నియమించారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని నియమించారు. అలాగే ఏసీబీ డీజీగా చారుసిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
కొత్త పరిపాలన రూపు
సమగ్రంగా చూస్తే, ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనలో కొత్త సమీకరణలకు దారితీశాయి. న్యాయ, రవాణా, భద్రత, పౌరసరఫరాలు, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టిన అధికారులు, రాబోయే రోజుల్లో పాలనలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ బదిలీలు పరిపాలనలో వేగవంతమైన నిర్ణయాలకు దారితీయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
55
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి
ఇదిలా ఉంటే తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేస్తున్నారు.