తెలంగాణ ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ వ‌చ్చేశాయ్‌.. వాట్సాప్‌లో అంద‌రికంటే ముందే తెలుసుకోండి

Published : Apr 12, 2026, 11:01 AM ISTUpdated : Apr 12, 2026, 11:14 AM IST

TG Inter Results: తెలంగాణలో ఇంటర్ లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుద‌ల చేశారు. 

PREV
15
అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో

ఫలితాల ప్రకటన వెంటనే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు https://tgbie.cgg.gov.in, https://results.cgg.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్ల‌లో ఫ‌లితాలు చూసుకోవ‌చ్చు. హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంది.

25
వాట్సాప్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసే సౌకర్యం

ఈసారి విద్యార్థులకు కొత్తగా వాట్సాప్ ద్వారా ఫలితాలను తెలుసుకునే సదుపాయం అందించారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ సేవను ప్రారంభించారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌లో ఎలా చూసుకోవాలంటే.

* ముందుగా మీ ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేయాలి.

* వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపాలి.

* వెంట‌నే చాట్‌బాట్ ఓపెన్ అవుతుంది.

* “BIE Exam Result” అని టైప్ చేయాలి

* “Start Service” పై క్లిక్ చేయాలి

* “Telangana BIE Results” ఎంపిక చేసుకోవాలి

* “Check Result” పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత హాల్ టికెట్ నంబర్, ఇయర్, స్ట్రీమ్ వివరాలు నమోదు చేయాలి.

* చివ‌రికి “Get Result” క్లిక్ చేస్తే వెంటనే ఫలితాలు కనిపిస్తాయి

35
ఈ ఏడాది పరీక్షలు, విద్యార్థుల హాజరు

ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడంతో ఫలితాలపై ఆసక్తి కూడా ఎక్కువగా కనిపించింది.

45
గత సంవత్సరాలతో పోలిస్తే ముందుగానే ఫలితాలు

ఈసారి ఫలితాలను గతంతో పోలిస్తే కొద్దిగా ముందుగానే ప్రకటించారు. సాధారణంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మేలో విడుదలయ్యే ఫలితాలు, ఈసారి ఏప్రిల్ 12న ప్రకటించడం విశేషం. గతంలో కొన్ని సంవత్సరాల్లో ఆలస్యమైనా, ఇప్పుడు వ్యవస్థ వేగంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

55
ఈసారి ఉత్తీర్ణ‌త ఎంతంటే.?

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఈసారి 70.58 ఉత్తీర్ణత న‌మోదైంది. ఈసారి దాదాపు 9.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories