సెప్టెంబర్ ఆరంభమే సెలవులతో మొదలవుతోంది. ఈ నెలలో ఓ నాల్రోజులు గడుస్తాయో లేదో మరో మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవుందో ఇక్కడ తెలుసుకుందాం.
School Holidays : తెలంగాణలో మరో మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు నడిచేది... తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులున్నాయి. సెప్టెంబర్ చివర్లో వరుసగా దసరా సెలవులున్నాయని అందరికీ తెలిసిందే... కానీ ఆరంభంలోనే వస్తున్న ఈ సెలవుల గురించి చాలామందికి తెలియదు. ఈ క్రమంలో ఈవారంలో వచ్చే వరుస సెలవులు వీకెండ్ ను లాంగ్ వీకెండ్ గా ఎలా మారుస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
DID YOU KNOW ?
దసరాా సెలవులు
సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు తెలంగాణలో దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అంటే మొత్తం 13 రోజులు ఇచ్చారు.
25
సెప్టెంబర్ 5న సెలవు.. ఎందుకో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 5న అధికారిక సెలవుగా ప్రకటించింది. ఈరోజు ముస్లింల పవిత్ర పండగ ఈద్ మిలాదున్ నబీ ఉంది... అంటే వారు దైవంగా కొలిచే మహ్మద్ ప్రవక్త జన్మదినం. కాబట్టి వచ్చే శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు... అలాగే వేడుకలు జరుపుకుంటారు. ఈ పండగ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకే కాదు కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించింది.
35
సెప్టెంబర్ 6 సెలవు.. హైదరాబాద్ లో పక్కా
ప్రస్తుతం తెలంగాణ వాడవాడల్లో బొజ్జ గణపయ్య కొలువయ్యారు... ప్రజలు భక్తిశ్రద్దలతో స్వామిని కొలుస్తున్నారు. అయితే సెప్టెంబర్ 6 కు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి 11 రోజులు పూర్తవుతుంది... ఈ సందర్భంగా నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు కొన్ని ముఖ్య పట్టణాల్లో వినాయక నిమజ్జన వేడుకలు కన్నులపండగగా జరుగుతాయి. ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొంటారు… అందుకే ఈరోజు సెలవు ఉంటుంది. ఇలా వచ్చే శనివారం వినాయక నిమజ్జనం నేపథ్యంలో సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈ సెలవుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రతిఏటా వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో పక్కా సెలవు ఉంటుంది. శివారు జిల్లాల్లో కూడా వేడుకలు జరిగే ప్రాంతాల్లో సెలవు ఇస్తారు. ఇలా ఈసారి సెప్టెంబర్ 6న వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతాయి... ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శనివారమే జరుగుతుందని ప్రకటించారు. కాబట్టి నగరంలో ఈ శనివారం సెలవు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది... ప్రభుత్వం కన్ఫర్మ్ చేయడమే మిగిలింది.
సెప్టెంబర్ 7 ఆదివారం... కాబట్టి ఈరోజు ఎలాగూ సాధారణ సెలవే. మొత్తంగా ఈ వారంలో ఇంకా మూడ్రోజులే (సెప్టెంబర్ 2,3,4) విద్యాసంస్థలు, కార్యాలయాలు నడిచేది... తర్వాత మూడ్రోజులు వరుస సెలవులు వస్తున్నాయి. ఆదివారం చంద్రగ్రహణం ఉంది... ఈ నేపథ్యంలో శుక్ర, శనివారం రెండ్రోజులు వినాయక నిమజ్జనాలు జరుగుతాయి... ఇలా ఏరోజు ధూంధాంగా నిమజ్జన వేడుకలు జరుపుకున్నా విద్యార్థులు, ఉద్యోగులకు తర్వాతిరోజు రెస్ట్ తీసుకునేందుకు వీలుంటుంది. ఇలా వినాయక నిమజ్జన వేడకుల వేళ లాంగ్ వీకెండ్ కలిసివస్తోంది.
55
సెప్టెంబర్ 21 నుండి సెలవులే సెలవులు
తెలంగాణ విద్యార్థులకు ఈ నెలలో భారీగా సెలవులు వస్తున్నాయి... ఈ వారం లాంగ్ వీకెండ్ తో సెలవులు ప్రారంభమైతే చివర్లో వరుసగా పదిరోజులు సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది... సెప్టెంబర్ 30 వరకు అంటే ఈ నెలలో పదిరోజులు దసరా సెలవులు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు అంటే 13రోజులు దసరా సెలవులు వచ్చాయి... అక్టోబర్ 4న తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి.