ఈ ప్రాజెక్టులోని ప్రతి నిర్మాణాన్ని క్వాలిటీగా, పక్కా ప్లానింగ్‌తో పూర్తి చేయడానికి ప్రభుత్వం జీవో నంబర్ 929 ద్వారా ఒక ప్రత్యేక సాంకేతిక కమిటీని నియమించింది.
• చైర్మన్: రోడ్లు & భవనాల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్
• కో-చైర్మన్: పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్
• కన్వీనర్: ఎంఆర్‌డీసీఎల్ చీఫ్ ఇంజనీర్
• సభ్యులు: దేవాదాయ శాఖ ఈఎన్సీ, ప్రసిద్ధ ఆలయ వాస్తు నిపుణుడు డాక్టర్ ఈ. శివనాగిరెడ్డి, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి.
ఈ కమిటీ డిజైన్లు, డ్రాయింగ్‌లు, డీపీఆర్‌ల పరిశీలనతో పాటు రాతి శిల్పాలు, ప్రత్యేక ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తుంది.