Telangana Chief Minister Revanth Reddy, Prime Minister Narendra Modi (Photo/ANI)
తీర్మానంలో ఏ అంశాలను ప్రస్తావించారు.?
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరించాలని తీర్మానంలోపేర్కొన్నారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోతాయని, పార్లమెంట్‌లో స్థానాల సంఖ్యను యథాతథంగా ఉంచాలి, అవసరమైన మార్పులను రాష్ట్ర స్థాయిలో చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తాజా జనాభా లెక్కల ప్రకారం పెంచాలని, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కి పెంచాలని కేంద్రాన్ని కోరారు.
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, పార్లమెంటు సభ్యత్వ స్థాయిని యథాతథంగా ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటపై నిలబడాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానా రెడ్డి ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించారు.