School Holidays
Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, ఉద్యోగులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది, ముస్లింల పండగ రంజాన్ ఈ ఏఢాది ఒకేసారి వచ్చాయి... దీంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో పండగ సెలవులు వస్తున్నాయి.
అయితే ఏపీలో కంటే తెలంగాణలో ఈ పండగలకు ఎక్కువరోజులు సెలవులు వస్తున్నాయి. పరీక్షలకు ముందు చదువుల ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ఈ పండగల సెలవులు ఊరట ఇవ్వనున్నాయి. అలాగే మండుటెండలతో ఇబ్బందిపడుతున్న ఉద్యోగులు హాయిగా ఇంట్లోనే ఉండి కుటుంబసభ్యులతో సరదాగా పండగలను జరుపుకోవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం ఒకేరోజు సెలవు వచ్చేలా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం వరుసగా ఐదురోజులు సెలవులు వస్తున్నాయి. వీకెండ్ కు ఈ పండగ సెలవులు కలిసివస్తుండటంతో అటు స్కూల్ విద్యార్థులు, ఇటు ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. పండగలను జరుపుకునేవారు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకోవచ్చు. మిగతావారు మండుటెండల వేళ వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో హాయిగా చల్లని ప్రదేశాలకు విహారయాత్ర ప్లాన్ చేసుకోవచ్చు.
ఉగాది ఆదివారం వస్తుంది... కాబట్టి ఓ సెలవు మిస్ అయినట్లే. ఇక రంజాన్ సోమవారం లేదంటే మంగళవారం ఉండే అవకాశముంది. దీన్నిబట్టి ఏపీలో సెలవు నిర్ణయించే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో ఈ రెండ్రోజులు కూడా సెలవు ఇచ్చేసారు. మొత్తంగా తెలంగాణలో ఐదు రోజులపాటు సెలవులు వస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో స్కూళ్లు నడిచేది... మార్చి 28 అంటే వచ్చే శుక్రవారం నుండి సెలవులు ప్రారంభం కానున్నాయి.
School Holidays
తెలంగాణలో మార్చి 28 నుండి ఏప్రిల్ 1 వరకు సెలవులు :
తెలంగాణలో ఇప్పటికే ఉగాది, రంజాన్ సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం మార్చి 30న ఉగాది వస్తోంది... ఈరోజు సెలవు ఇచ్చాయి. అయితే ఆరోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి పండగ లేకున్నా సెలవు ఉండేది.
ఇక మార్చి 31న అంటే ఉగాది తర్వాతిరోజే ముస్లింల పవిత్ర పండగ రంజాన్ వస్తోంది. అందుకే సోమవారం పండగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ సెలవు ఉటుంది. రంజాన్ తర్వాతిరోజు అంటే ఏప్రిల్ 1న కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. ఇలా వరుస పండగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఉగాదికి ముందు రెండ్రోజుల కూడా తెలంగాణలో పలు విద్యాసంస్థలకు సెలవు రానుంది. మార్చి 28 రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం... ఈరోజును ముస్లింలు జమాతుల్ వదా లేదా షబ్-ఎ-ఖాదర్ జరుపుకుంటారు. చాలా పవిత్రంగా భావించే ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అందువల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ శుక్రవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది.
అంటే ఈ శుక్రవారం మైనారిటీ విద్యాసంస్థలతో పాటు ముస్లిం విద్యార్థులు ఎక్కువగా చదువుకునే విద్యాసంస్థలకు సెలవు ఉంటుందన్నమాట. అలాగే ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ప్రత్యేకంగా సెలవు తీసుకోవచ్చు. హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రభావం ఉంటుంది.
తర్వాతిరోజు మార్చి 29 శనివారం. హైదరాబాద్ లో చాలా ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ఉంటుంది. ముఖ్యంగా కార్పోరేట్ విద్యాసంస్థలు ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు వారానికి రెండ్రోజులు (శని, ఆదివారం) సెలవులు ఇస్తుంటాయి. కాబట్టి వచ్చే శనివారం ఇలాంటి స్కూళ్లకు సెలవు ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే ఇవాళ (మార్చి 27, గురువారం) ఒక్కరోజు తెలంగాణలోని స్కూళ్లన్ని పూర్తిస్థాయిలో నడిచేది. ఆ తర్వాత వరుసగా మార్చి 28,29,30,31 మరియు ఏప్రిల్ 1 సెలవు ఉండనుంది. ఇందులో ఆది, సోమ, మంగళవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సాధారణ సెలవు కాగా... శుక్రవారం ఆప్షనల్ హాలిడే. ఇక శనివారం కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
Summer Holidays
ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు :
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పరీక్షలు ముగియగానే అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి.
ఏప్రిల్ నెలంతా పరీక్షలతో గడిచిపోనుంది... దీంతో ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి. మే నెలంతా విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉంటాయి... జూన్ 12న తిరిగి ప్రారంభం అవుతాయి. ఇలా ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు అంటే దాదాపు నెలన్నర వేసవి సెలవులు వస్తున్నాయి.