Telangana: కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం

Published : Jul 02, 2026, 07:03 PM IST

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనా సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

PREV
13
ఉపాధ్యాయులకూ భోజన పథకం..

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పథకం అమలులో నాణ్యతను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా అదే ఆహారం తీసుకోవడం వల్ల భోజనం పరిశుభ్రత, పోషక విలువలు, వంట ప్రక్రియపై ప్రత్యక్ష పర్యవేక్షణ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో భోజన నాణ్యతపై మరింత జవాబుదారీతనం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

23
విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పీఎం-పోషణ్ పథకం కింద తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ వ్యవస్థను మరింత సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ అదే ఆహారం తీసుకోవడం వల్ల భోజన నాణ్యతలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి సరిదిద్దే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థులకు మరింత మెరుగైన, సురక్షితమైన పౌష్టికాహారం అందుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

33
ప్రభుత్వ కళాశాలల్లోనూ అమలు

ఇటీవలే రాష్ట్రంలోని సుమారు 430 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు దానిని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థులతో పాటు బోధనా సిబ్బందిని కూడా ఈ పథకంలో భాగం చేయడం ద్వారా విద్యాసంస్థల్లో ఆహార నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్యాబినెట్ ఆమోదం లభించడంతో త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories