తెలంగాణలో ఇంజనీరింగ్ అద్భుతాలు... ఏపీని మించిన ఆదాయం, ఎంతో తెలుసా?

Published : Aug 19, 2025, 03:55 PM IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయిన తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోంది. ఏపీని వెనక్కినెట్టి మరీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల్లో అయితే అందనంత ఎత్తుకు ఎదిగింది. 

PREV
15
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ

Telangana Growth: భారతదేశంలో అతి తక్కువ వయసుగల రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్రం ఏర్పడి పది పదకొండేళ్లు మాత్రమే అవుతోంది... ఇంత తక్కువ కాలంలోనే వ్యాపారాభివృద్ధిలో దూసుకుపోతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల రంగంలో విశేష విజయాన్ని సాధించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది తెలంగాణ నుంచి 19.1 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఇది కేవలం 14.01 బిలియన్ డాలర్లుగా ఉంది… ఈసారి 36 శాతం వృద్ధి సాధించింది. 2020–21 తర్వాత ఎగుమతుల్లో ఇంత భారీ వృద్ధి సాధించడం ఇదే తొలిసారి.

భారతదేశంలో ఎగుమతుల పరంగా తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తర్వాత తెలంగాణ స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణ నుండి ముఖ్యంగా ఇంజనీరింగ్ గూడ్స్, ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్, ఆర్గానిక్–ఇనార్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే 2024–25లో తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల విలువ 7.54 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ విషయంలో ఏపీకంటే ముందుంది తెలంగాణ.

DID YOU KNOW ?
జిడిపిలోనూ తెలంగాణ టాప్
తెలంగాణ జిడిపి ప్రస్తుతం రూ.16.12 లక్షల కోట్లకు చేరింది. దేశ సగటు వృద్ధిరేటు 9.9 శాతం అయితే తెలంగాణది 10.1 శాతంగా ఉంది.
25
ఫార్మా ఎగుమతులకు వెనక్కినెట్టిన ఇంజనీరింగ్ గూడ్స్

తెలంగాణ నుండి ఎగుమతులు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఫార్మారంగం. హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా, కెమికల్స్ కంపెనీలున్నాయి... ఇక్కడినుండి దేశవిదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణ నుండి అత్యధిక ఎగుమతుల వాటా ఈ రంగానిదే. కానీ మొదటిసారి దీన్ని వెనక్కినెట్టి ఇంజనీరింగ్ ఎగుమతులు మొదటిస్థానాన్ని ఆక్రమించాయి. 2025-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుండి ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 7 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్ 5.89 బిలియన్ డాలర్టు, ఆర్గానిక్ ఆండ్ ఇనార్గానిక్ కెమికల్స్ విలువ 2.43 బిలియన్ డాలర్లుగా ఉంది… ఈ రెండు కలిపినా ఇంజనీరింగ్ ఎగుమతుల కంటే తక్కువే.

తెలంగాణ మొత్తం ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్ వాటానే 39.41% గా ఉంది. ఇక ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్ వాటా 30.79% ఉంది. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించింది. 2023–24లో ఇంజనీరింగ్ గూడ్స్ విలువ 3.46 బిలియన్ డాలర్లు ఉండగా 2024–25లో 117.9% వృద్ధితో 7.54 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

ఈ గణాంకాలు తెలంగాణ ఎగుమతుల రంగం బలంగా విస్తరిస్తోందని స్పష్టం చేస్తున్నాయి. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇంజనీరింగ్ గూడ్స్, ఫార్మాస్యూటికల్ రంగాలు రాష్ట్ర ఎగుమతులకు ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నాయి. ఈ రికార్డు వృద్ధితో తెలంగాణ దేశ ఆర్థికవ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

35
ఇంజనీరింగ్ ఉత్పతుల్లో తెలంగాణను టాప్ లో నిలవడానికి కారణమిదే..

మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ ఏడోస్థానంలో ఉన్నా కేవలం ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిలో నాలుగోస్థానంలో నిలిచింది. తాజాగా కర్ణాటకను కూడా వెనక్కినెట్టింది. 22 బిలియన్ డాలర్ల ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా తర్వాత తమిళనాడు 18 బిలియన్ డాలర్లు, గుజరాత్ 16 బిలియన్ డాలర్లతో టాప్ 3 లో నిలిచాయి. తర్వాతిస్థానం తెలంగాణదే. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎనిమిదో స్థానంలో (4.32 బిలియన్ డాలర్లతో) నిలిచింది.

తెలంగాణ ఎయిర్ క్రాఫ్ట్, స్పెస్ క్రాఫ్ట్, డిఫెన్స్ వస్తువుల ఉత్పత్తి, ఎగుమతిలో వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2024 లో కేవలం 9 నెలల్లోనే ఈ రంగాల్లో తెలంగాణ నుండి రూ.30,742 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇలా పార్మా రంగాన్ని ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు వెనక్కి నెట్టడంతో ఇవి కీలకంగా వ్యవహరించాయి. తెలంగాణ ఎరోస్పైస్ ఆండ్ డిఫెన్స్ ఫాలసీ హైదరాబాద్ ను ఎరోస్పేస్ హబ్ గా మార్చింది.

45
ఏరో స్పేస్ రంగంలో గేమ్ ఛేంజింగ్ సంస్థలు

స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ : 

ఇది భారతీయ ప్రైవేట్ ఏరోస్పేస్ తయారీదారు, వాణిజ్య ప్రయోగ సర్వీస్ ప్రొవైడర్. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఈ సంస్థను ఇస్రోకు చెందిన మాజీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు స్థాపించారు.

ధ్రువ స్పేస్ :

 ఇది కూడా ఇండియన్ స్పేస్ సెక్టార్ లో పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్ భాగాలను తయారుచేస్తుంది... ఇతర అంతరిక్ష సంబంధిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది.

అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ : 

ఇది హార్డ్‌వేర్ ఆండ్ సాఫ్ట్‌వేర్ సేవలను అందించే భారతీయ అంతరిక్ష తయారీ సంస్థ. ఈ కంపెనీ లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్ పేలోడ్‌లు, గ్రౌండ్ సిస్టమ్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ ఆండ్ మెకానికల్ సబ్‌సిస్టమ్‌లను తయారు చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది.

టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) :

 ఇది బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్. ఇది కూడా హైదరాబాద్ నుండి కార్యకలాపాలు సాగిస్తుంది. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతిలో ఇదికూడా కీలకపాత్ర పోషిస్తోంది.

55
డిఫెన్స్, ఏరోస్పేస్ హబ్ గా హైదరాబాద్

ఏవియేషన్ రంగంలో హైదరాబాద్ నాలుగు సార్లు ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో కూడిన ఏరోస్పేస్ నగరాల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణాలో ఏరోస్పేస్ రంగంలో వృద్ధి సాధించడమే కాదు నాయకత్వ పాత్ర పోషిస్తోంది. స్టార్టప్‌లు, గ్లోబల్ OEMలు, DRDO ప్రయోగశాలలు విస్తృతంగా ఎదుగుతున్న నేపథ్యంలో తెలంగాణ భారత భవిష్యత్తును రక్షణ, అంతరిక్ష రంగాల్లో నిర్మిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories