సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

First Published | Jul 2, 2023, 4:13 PM IST

ఈ ఏడాది సెప్టెంబర్  17 నాటికి ఎన్నికల మేనిఫెస్టోను  ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ  కసరత్తు  చేస్తుంది. మరో నాలుగు  డిక్లరేషన్లను ప్రకటించేందుకు  కాంగ్రెస్ నాయకత్వం  ప్రయత్నాలు  చేస్తుంది.

సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

ఈ ఏడాది  చివర్లో జరిగే  అసెంబ్లీ ఎన్నికలకు  కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది.  ఈ ఏడాది సెప్టెంబర్  17వ తేదీ నాటికి  మేనిఫెస్టోను  ప్రకటించేందుకు  కాంగ్రెస్ పార్టీ ప్లాన్  చేసింది.   రానున్న  రోజుల్లో  మరో నాలుగు  డిక్లరేషన్లను కూడ  కాంగ్రెస్ పార్టీ  ప్రకటించనుంది

సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

ఖమ్మంలో  కాంగ్రెస్ పార్టీ ఇవాళ  నిర్వహిస్తున్న సభ ద్వారా  ఎన్నికల శంఖారావాన్ని  కాంగ్రెస్  పార్టీ పూరించనుంది.   ఇప్పటికే  రైతు డిక్లరేషన్ ను, యూత్ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  బీసీ,మహిళ,  మైనార్టీ సహా మరో డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ  ప్రకటించనుంది. 

సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

 ఈ నెల  15 తర్వాత తెలంగాణకు  ప్రియాంక గాంధీ  వచ్చే అవకాశం ఉంది.   ఇటీవలనే  భువనగిరి  ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి   ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. ఈ 15 వ తేదీన  తెలంగాణలో పర్యటించేందుకు సమయం ఇవ్వనున్నట్టుగా  ప్రియాంక గాంధీ  వెంకట్ రెడ్డికి హామీ ఇచ్చారు.
 
సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  జరిగిన  రెండు  ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ  అధికారాన్ని కోల్పోయింది.  అయితే  ఈ దఫా  తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం పట్టుదలగా  ఉంది

సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

కర్ణాటక  రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం  తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ ను నింపాయి.  కర్ణాటక తరహాలోనే  తెలంగాణ నేతలు  పని చేయాలని   తెలంగాణ నేతలకు కాంగ్రెస్ నాయకత్వం  సూచించింది. 
 
సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో: త్వరలో మరో నాలుగు డిక్లరేషన్లు

తమ మధ్య ఉన్న విబేధాలను  పక్కన పెట్టి   పార్టీ విజయం కోసం  పనిచేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ నేతలను ఆదేశించింది. 

Latest Videos

click me!